| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

గుర్తు తెలియని వాహనం ఢీకొని చిరుత మృతి

గుర్తు తెలియని వాహనం ఢీకొని చిరుత మృతి

డైలీ భారత్, మహబూబ్‌నగర్: గుర్తు తెలియని వాహనం ఢీకొని చిరుత పులి మృతి చెందిన సంఘటన మహ బూబ్‌నగర్ జిల్లా మూసా పేట మండల పరిధిలోని కోమిరెడ్డిపల్లి గ్రామ శివారు లో శనివారం రాత్రి జరిగింది.

పోలీసులు తెలిపిన వివ రాల ప్రకారం… ఎండాకాలం కావడంతో చిరుతలు నీళ్ల కోసం అడవుల నుంచి గ్రామాల వైపుకు వస్తున్నా యి. చిరుత రోడ్డు దాటే క్రమంలోగుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో రోడ్డు పక్కన పడిపోయింది.

వాహనదారులు గమనించి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఫారెస్ట్ అధికారులు అక్కడికి చేరుకొని చిరుత కళేబరాన్ని స్వాధీనం చేసుకన్నారు.

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు....

Previous 9వ తరగతి బాలికను గర్భవతిని చేసిన యువకుడు
Next అడవికి అంటుకున్న కార్చిచ్చు: వందల ఎకరాల్లో అడవి దగ్ధం
ADVERTISEMENT