డైలీ భారత్, హైదరాబాద్: పార్లమెంటు ఎన్నికల వేళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణ యం తీసుకుంది. హైదరా బాద్‌లో బీజేపీ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొంపెల్లి మాధవీలతకు వై ప్లస్ సెక్యూరిటీని కల్పిం చింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం సున్నిత మైన ప్రాంతం కావడంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వై ప్లస్ సెక్యూ రిటీలో భాగంగా మాధవీల తకు 11 మంది భద్రత కల్పించనున్నారు.
ఇందులో ఆరుగురు సీఆర్ పీఎఫ్ పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్స్ ఆమె వెంట నిత్యం పహారా కాస్తారు. మరో ఐదుగురు సాయుధలైన గార్డులు ఆమె నివాసం వద్ద సెక్యూరిటీగా ఉండను న్నారు...