బిజెపి గెలుపు కోసం కష్టపడి పని చేయాలి
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి
మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి డీకే అరుణను భారీ మెజార్టీతో గెలిపిస్తాం
నరేంద్ర మోడీని మళ్లీ ప్రధానిని చేయడమే లక్ష్యం
షాద్ నగర్ బిజెపి నేత పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి
డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా : భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేయాలని ప్రధానమంత్రి మోడీని మరోసారి ప్రధానమంత్రిగా చేసేందుకు కార్యకర్తలు, నాయకులు ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉండాలని బిజెపి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. ఆదివారం బిజెపి రాష్ట్ర పార్టీ కార్యాలయంలో రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గానికి చెందిన సీనియర్ నాయకుడు, పాలమూరు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి బిజెపి పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థిని డీకే అరుణ సమక్షంలో బిజెపి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 400కు పైగా పార్లమెంటు సీట్లను సాధించి దేశవ్యాప్తంగా మూడోసారి నరేంద్ర మోడీ ప్రధాని కావడం ఖాయమని అన్నారు. ప్రతి గ్రామం ప్రతి పట్టణం ప్రతి మండలం జిల్లా ఇలా అన్ని ప్రాంతాల్లో కాషాయ జెండా రెపరెపలాడేలా చూసుకోవాలని సూచించారు. షాద్ నగర్ అసెంబ్లీలో బిజెపి పార్లమెంట్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఓట్లను సాధించాలని విష్ణువర్ధన్ రెడ్డికి సూచించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి, డీకే అరుణ తదితరులు విష్ణువర్ధన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.
మోడీని ప్రధాని చేయడమే లక్ష్యం
మోడీని మరోసారి ప్రధానమంత్రిని చేయడమే తన లక్ష్యమని పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి మీడియాతో అన్నారు. ఆదివారం పార్టీ కార్యాలయంలో బిజెపిలో చేరిన సందర్భంగా ఆయన "నేడు ప్రతినిధి"తో మాట్లాడారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి సత్తా చాటి పెద్ద ఎత్తున ఓట్లను సాధిస్తామని అన్నారు. పార్టీలోకి తిరిగి రావడం ఎంతో సంతోషంగా ఉందని, పార్టీలో తనకు ఆహ్వానించిన రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, పార్లమెంటు అభ్యర్థిని డీకే అరుణ తదితరులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తాను పార్టీకి కంకణ బద్ధుడనై పనిచేస్తానని హామీ ఇచ్చారు. పార్లమెంటు ఎన్నికల్లో డీకే అరుణ గెలుపు కోసం సర్వశక్తులను వడ్డుతానని విష్ణువర్ధన్ రెడ్డి హామీ ఇచ్చారు..