| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

గొంతు కోసి వివాహిత దారుణ హత్య

గొంతు కోసి వివాహిత దారుణ హత్య

నిజామాబాద్ జిల్లాలో గొంతు కోసి వివాహిత దారుణ హత్య

డైలీ భారత్, నిజామాబాద్ జిల్లా: పట్టపగలే వివాహిత దారుణ హత్యకు గురైన ఘటన ఈరోజు మధ్యా హ్నం నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే..ఆర్మూర్ పట్టణంలోని సంతోష్ నగర్‌ లో ఓ వివాహితను గుర్తు తెలియని దుండగులు అతి దారుణంగా గొంతు కోసి హతమార్చారు.

అనంతరం నిందితులు అక్కడి నుంచి ఉడాయిం చారు. స్థానికుల సమాచా రం మేరకు ఘటనా స్థలానికి చేరకున్న పోలీసులు హత్య జరిగిన ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఆధారాలను సేకరించారు.

ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు. పాత కక్షల నేపథ్యంలో వివాహితను హత్య చేశారా?లేక మరే ఇతర కారణం చేతైనా ఈ దారుణానికి ఒడిగట్టారా?అన్న కోణంలో పోలీసులు ప్రాథమికంగా విచారణ చేస్తున్నారు.

అయితే, హత్యకు సంబం ధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Previous భూకబ్జా కేసులో కల్వకుంట్ల కన్నారావును అరెస్ట్
Next కొండగట్టు అంజన్న దేవాలయం ఈవో సస్పెన్షన్‌
ADVERTISEMENT