శివరాత్రి సందర్భంగా శివలింగానికి ప్రత్యేక పూజలు
డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా బ్యూరో : ఉత్తర రామలింగేశ్వర స్వామి మహిమాన్విత్వ ఆలయమైన రామేశ్వరంలో శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని రాత్రి సమయంలో స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రత్యేక పూజలు చేశారు. శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా జరుగుతున్న ఆధ్యాత్మిక వేడుకలకు ఎమ్మెల్యే శంకర్ హాజరవగా దేవస్థానం పూజారులు, ఆలయ సిబ్బంది ఆయనకు స్వాగతం పలికారు. ఎమ్మెల్యే పంచామృతాలతో స్వామికి అభిషేకం చేయించారు. అనంతరం ఎమ్మెల్యేను సన్మానించారు. భక్తులకు స్వామి తీర్థ ప్రసాదాలు అందజేశారు..