| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

పండగ పూట విషాదం

పండగ పూట విషాదం

నిజామాబాద్ జిల్లా లో పండగ పూట విషాదం

డైలీ భారత్, నిజామాబాద్:నిజామాబాద్ జిల్లా, ముప్కాల్‌లో శివరాత్రి పండగ పూట విషాధం చోటుచేసుకుంది.

మండలంలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పరిధిలోని లక్ష్మీ కాలువలో హెడ్ రెగ్యులేటర్ వద్ద ప్రాజెక్టులో ముగ్గురు యువకులు ఈరోజు మృతి చెందారు.

స్థానికులు, అధికారులు తెలిపిన వివరాల ప్రకారం…జక్రాన్‌పల్లి మండలం, గన్య తండాకు చెందిన ఆరుగురు యువకులు కారులో వచ్చి, ముగ్గురు యువకులు స్నానం ఆచరించి పక్కన ఉండగా మరో ముగ్గురు మరొకసారి స్నానం చేస్తా మని,కాలువ ముందర ప్రాజెక్టులో దూకారు.

అయితే, వీరు అందులో పడి గల్లంతయ్యారు. విషయం తెలుసుకొన్న అధికారులు, స్థానిక ఎస్‌ఐ గజ ఈతగాళ్ల కోసం ఫోన్ చేసి రప్పించారు..

అనుకున్నంత మంది ఈతగాళ్లు రాకపోవడంతో బాల్కొండ మండలానికి చెందిన ఎస్‌ఐ గోపి ధైర్యంతో ఒక అడుగు ముందుకు వేసి నీటిలో దూకి గాలింపు చర్యలు చేపట్టి, గల్లంతయిన యువకులను బయటకు తీశారు.

మృతులను సాయినాథ్, లోకేష్, మున్నాగా గుర్తిం చారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఆర్మూర్ ఎసిపి బస్వారెడ్డి బృందం మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ దవాఖానాకు తరలిం చారు...

Previous దిల్లీ లిక్కర్‌ కేసులో నేను బాధితురాలినే : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
Next రామలింగేశ్వర స్వామి దర్శించుకున్న షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
ADVERTISEMENT