మైనంపల్లి హన్మంతరావు,చెరుకు శ్రీనివాస్ రెడ్డిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన తాడెం వెంగళరావు
కాంగ్రెస్ లో చేరిన నలుగురు తాజా మాజీ సర్పంచులు
డైలీ భారత్, చేగుంట:మెదక్ జిల్లా చేగుంట మండలం బి ఆర్ఎస్ పార్టీ మండల మాజీ అధ్యక్షులు తాడెం వెంగళరావు బి ఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి అనంతరం బిజెపి పార్టీలో చేరారు ఎమ్మెల్యే ఎన్నికల్లో ప్రచారం చేయడం జరిగింది బిజెపి పార్టీలో తాడెం వెంగళరావుకు పార్టీ ఆదరణ చూపలేదు వెంటనే బిజెపి పార్టీకి రాజీనామా చేసి గత వారం రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరారు అదే విధంగా ప్రచారంలో పాల్గొన్నారు వెంగళరావు తో పాటు ఉన్న కార్యకర్తలు అభిమానులు వెంగళరావు ఆధ్వర్యంలో బిజెపిలో నుండి భారీగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, దుబ్బాక కాంగ్రెస్ పార్టీ నియోజక వర్గ ఇంఛార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్, బిజెపి పార్టీలో తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో చేగుంట మండల మాజీ అధ్యక్షులు వెంగళరావుకు కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. చేగుంట మండల కో ఆప్షన్ సభ్యులు మహ్మద్ అలీ మాజీ సర్పంచులు మహిపాల్ యాదవ్, భిక్యా నాయక్, గన్య నాయక్, బట్టి అంజగౌడ్, గోకని జగన్గౌడ్, పబ్బనగేష్, వెంకటస్వామి,మాజీ ఎంపీటీసీ అలి అంజిరెడ్డి,మమిండ్ల బాలయ్య,మైనార్టీ మండల సీనియర్ నాయకులు సాబేర్ హుస్సేన్,బిఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు , చిన్నశేన్న నర్సింహ, గాదె స్వామి, మాలోత్ రాజు,అవుబోతు నాగరాజు,కేతావత్ రాము,దరావత్ సుభాష్,బ్యాగరి రామస్వామి,పాల్గొన్నారు.