| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

సాగునీటి కోసం రోడ్డెక్కిన రైతన్న

సాగునీటి కోసం రోడ్డెక్కిన రైతన్న

డైలీ భారత్, పెద్దపల్లి జిల్లా: పెద్దపల్లి జిల్లా మంథని మండల కేంద్రంలోని మంథని, నుండి పెద్దపల్లి జిల్లా కు వెళ్లే ప్రధాన రహదారిపై గురువారం మంథని మండల పరిధిలోని పలు గ్రామాల రైతులు ధర్నా నిర్వహించారు.

ఇరిగేషన్ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల తమ పంటలకు ఎస్సారెస్పీ కాలువ నుండి నీరు అందడం లేదని, పంటలు ఎండి పోతున్నా యని రైతులు అవేదన వ్యక్తం చేశారు.

 సమాచారం అందుకున్న మంథని ఆర్డీవో హనుమ నాయక్ ప్రభుత్వం తరుఫున నీరు అందేలా చర్యలు తీసుకుంటామని రైతులకు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

ఈ ధర్నాతో కొంతసేపు ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. ధర్నా సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మంథని సిఐ వెంకటేశ్వర్లు, ఎస్సై వెంకట కృష్ణ, సిబ్బంది కలిసి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు

Previous అరుదైన జాతి కోతుల అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు
Next మంటల్లో దగ్ధమైన కారు.. తప్పిన భారీ ప్రమాదం
ADVERTISEMENT