డైలీ భారత్, శ్రీకాకుళం జిల్లా: అరుదైన జాతి కోతుల అక్రమ రవాణా ముఠా ఈరోజు గుట్టు రట్టయింది. కోతుల అక్రమ రవాణా ముఠాను ఇచ్చాపురం చెక్ పోస్ట్ వద్ద పోలీసులు పట్టుకొని అరెస్టు చేశా రు.ఇద్దరు వ్యక్తులు వాహనంలో కోతులను తరలిస్తుండగా చెక్ పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో పోలీస్ అధికారులు పట్టుకున్నారు.
అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగి లోతైన విచారణ చేపడుతు న్నారు.వీటిని కలకత్తా నుండి చెన్నై మీదగా ఇతర దేశాలకు తరలిస్తున్నట్లు సమాచారం.
ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది