| Daily భారత్
Logo




మీడియా అకాడమీ చైర్మన్‌కు అభినందనల తెలిపిన గుడిపల్లి శ్రీనివాస్

News

Posted on 2024-02-26 15:22:36

Share: Share


మీడియా అకాడమీ చైర్మన్‌కు అభినందనల తెలిపిన గుడిపల్లి శ్రీనివాస్

డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా బ్యూరో :తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌ గా టియుడబ్ల్యూజీ (ఐజేయు) జాతీయ అధ్యక్షులు, సీనియర్‌ సంపాదకుడు కే శ్రీనివాసరెడ్డిని నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జర్నలిస్టుల హక్కులు సంక్షేమం కోసం దశాబ్దాల పాటు పోరాటం చేసిన వ్యక్తికి మీడియా అకాడమీ చైర్మన్‌ పదవి ఇవ్వడంతో సంపూర్ణ న్యాయం జరుగుతుందని జర్నలిస్టు సమాజం విశ్వాసం వ్యక్తం చేస్తుంది. 1996లో ప్రెస్‌ అకాడమీ ఏర్పడగా మొదటి చైర్మన్‌ బాధ్యతలు స్వీకరించిన ఆయన మరో మారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రభుత్వంలో మీడియా అకాడమీ చైర్మన్‌ గా బాధ్యతలు స్వీకరించనున్నారు.

విషయం తెలిసిన వెంటనే టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి  గుడిపల్లి శ్రీనివాస్  (పేపర్ శ్రీను) పుష్పగుచ్చం అందించి శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా  గుడిపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలపై సంపూర్ణ అవగాహన కలిగిన వ్యక్తికి మీడియా అకాడమీ చైర్మన్‌ రావడం శుభ సూచికం అన్నారు. కె శ్రీనివాస రెడ్డి హయాంలో సంపూర్ణ న్యాయం జరుగుతుందని తెలంగాణ జర్నలిస్టులు పూర్తి విశ్వాసంతో ఉన్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ ఆవిర్భావం అనంతరం జర్నలిస్టుల స్థితిగతులు మారతాయని ఆకాంక్షించిన జర్నలిస్టులకు అనుకున్న మేర న్యాయం జరగలేదన్నారు.ఈ కార్యక్రమంలో  టియుడబ్ల్యూజే ( ఐజేయు )  

రాష్ట్ర అధ్యక్షుడు విరహత్ అలీ ,రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కొంపల్లి శ్రీకాంత్ రెడ్డితో పాటు పలువురు సీనియర్‌ జర్నలిస్టులు వివిధ సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు, చైర్మన్‌ కు శుభాకాంక్షలు తెలియజేశారు

Image 1

170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర

Posted On 2026-08-03 18:44:40

Readmore >
Image 1

వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్

Posted On 2026-08-03 16:58:20

Readmore >
Image 1

వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ

Posted On 2026-08-03 14:31:13

Readmore >
Image 1

చంద్రంపేట ఉన్నత పాఠశాలలో అత్యంత వైభవంగా బోనాల పండుగ

Posted On 2026-08-03 14:16:26

Readmore >
Image 1

హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్ "సామాజిక న్యాయ తెలంగాణ – సంకల్ప సభ"

Posted On 2026-08-03 14:09:30

Readmore >
Image 1

చిట్టీల పేరుతో ఐదు కోట్ల రూపాయలు ముంచి పరార్

Posted On 2026-08-03 05:58:15

Readmore >
Image 1

60 వేలు ఇచ్చి వివాహం చేసు కున్నాడు...తెల్లారే సరికి పెట్టె బేడా సర్దుకుని ఊడయించిన నవవధువు

Posted On 2026-08-03 05:55:39

Readmore >
Image 1

ప్రతి ఇంట్లో తెలిసి ఉండాల్సిన 25 ముఖ్యమైన మందులు – ఉపయోగాలు, జాగ్రత్తలు

Posted On 2026-08-03 05:54:41

Readmore >
Image 1

అంగరంగ వైభవంగా పాపకొల్లు గ్రామంలో ఆషాడ మాస బోనాల పండుగ కార్యక్రమం

Posted On 2026-08-03 05:49:18

Readmore >
Image 1

బిజెపి నాయకత్వంపై నమ్మకంతో పనిచేస్తా... రమేష్ యాదవ్

Posted On 2026-08-02 15:18:04

Readmore >