| Daily భారత్
Logo




అవసరాలకు అనుగుణంగా రైల్వే సౌకర్యాలు కల్పించండి : ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

News

Posted on 2024-02-26 11:54:32

Share: Share


అవసరాలకు అనుగుణంగా రైల్వే సౌకర్యాలు కల్పించండి : ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

వ్యక్తుల కోసం నాయకుల కోసం అభివృద్ధి పనులు ఆపొద్దు

షాద్ గర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

చటాన్ పల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులపై తీవ్ర అసంతృప్తి

ప్రజాధనాన్ని వృధా చేయొద్దని కేంద్రానికి వినతి

షాద్ నగర్ రైల్వే స్టేషన్ ఆధునీకరణకు రూ. 9.59 కోట్ల మంజురుపై హర్షం

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా బ్యూరో : షాద్ నగర్ నియోజకవర్గ రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం కేంద్ర ప్రభుత్వం 9.59 కోట్ల రూపాయల నిధులతో రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేయడం హర్షనీయమని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ స్పష్టం చేశారు. సోమవారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ రైల్వే స్టేషన్ లో అమృత్ భారత్ కార్యక్రమంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ ఆన్లైన్ సమావేశానికి స్థానిక ఎమ్మెల్యే హోదాలో హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థానిక మున్సిపల్ చైర్మన్ కే. నరేందర్, భారతీయ జనతా పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బొక్క నరసింహారెడ్డి, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందే బాబయ్య, జిల్లా అధికార ప్రతినిధి కక్కునూరు వెంకటేష్ గుప్తా, యువ నాయకుడు చెట్ల వెంకటేష్, సీనియర్ నేత నాగిళ్ల గోపాల్ గుప్త, మనోహర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు చెంది తిరుపతిరెడ్డి, దంగు శ్రీనివాస్ యాదవ్, అందే మోహన్, ముబారక్ అలీ ఖాన్ తదితరులు హాజరయ్యారు.

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ.. ప్రజల అవసరాలకు అనుగుణంగా రైల్వే అభివృద్ధి పనులు చేయడం కూడా ఎంతో ప్రధానమని అన్నారు. అమృత్ భారత్ కార్యక్రమంలో భాగంగా స్థానిక రైల్వే స్టేషన్ ను ఆధునికరించెంకు కేంద్రం ముందుకు రావడం అభినందనీయమని పేర్కొన్నారు. అయితే రైల్వే అభివృద్ధి పనుల్లో భాగంగా అధికారులు గతంలో కొంతమంది ప్రజాప్రతినిధుల, నాయకుల మాటలు నమ్మి ప్రజలకు అవసరం లేనివిధంగా రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణాలు చేపట్టడం సమంజసం కాదని అసంతృప్తి వ్యక్తం చేశారు. పదిమందికి ప్రయోజనం చేకూరే పనుల్లో నాయకుల స్వార్థం జత చేయడం ఎంత మాత్రం శ్రేయస్కరం కాదని అన్నారు.  చటాన్ పల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు మొదటి నమూనాను ఏమార్చి అప్పటి పాలకులు స్థానిక నాయకులకు ప్రయోజనం చేకూరే విదంగా డిజైన్లలో మార్పులు చేశారని దీనిని ప్రజలు క్షమించరని ఎమ్మెల్యే అన్నారు. రైల్వే అధికారులు ప్రజలకు ఉపయోగపడే విధంగా సాంకేతిక పరిజ్ఞానంతో భవిష్యత్తుకు ఉపయోగం ఉండేలా చూడాలని, స్వార్ధ ప్రజా ప్రతినిధుల, నాయకుల మాటలు నమ్మితే దానివల్ల ప్రయోజనం ఉండదని అన్నారు. అండర్ గ్రౌండ్ రహదారుల వల్ల ప్రయోజనం పెద్దగా ఉండదని అన్నారు. దీనివల్ల వర్షాకాలంలో వర్షాలు వచ్చినప్పుడు అండర్ గ్రౌండ్ రోడ్లు మునిగిపోతాయని రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడతాయని అన్నారు. ఇప్పటికే కొత్తూరు వద్ద అదే పరిస్థితి ఏర్పడిందని,  చిలకమర్రి వద్ద కూడా ఇదే పరిస్థితి దాపురించిందని ఎమ్మెల్యే వివరించారు. నాయకుల ప్రయోజనాల కోసం ప్రజాప్రయోజనాలను తాకట్టు పెట్టడం సిగ్గుచేటని ఎమ్మెల్యే ఘాటుగా స్పందించారు. చటాన్ పల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులకు సంబంధించి మొదటి నమూనా అమలు చేసే విధంగా తాను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ తో మాట్లాడుతానని, ఇంకా సంబంధిత ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి మార్పుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. అదేవిధంగా రతన్ కాలనీ రైల్వే స్టేషన్ ఏర్పాటు ముందు నుండి ఉందని, అలాంటి కాలనీకి ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకోకుండా రహదారిని విస్మరించడం సరికాదని, ఈ విషయంలో కూడా రైల్వే అధికారులు పరిష్కార మార్గం చూపాలని ఎమ్మెల్యే కోరారు..

Image 1

170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర

Posted On 2026-08-03 18:44:40

Readmore >
Image 1

వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్

Posted On 2026-08-03 16:58:20

Readmore >
Image 1

వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ

Posted On 2026-08-03 14:31:13

Readmore >
Image 1

చంద్రంపేట ఉన్నత పాఠశాలలో అత్యంత వైభవంగా బోనాల పండుగ

Posted On 2026-08-03 14:16:26

Readmore >
Image 1

హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్ "సామాజిక న్యాయ తెలంగాణ – సంకల్ప సభ"

Posted On 2026-08-03 14:09:30

Readmore >
Image 1

చిట్టీల పేరుతో ఐదు కోట్ల రూపాయలు ముంచి పరార్

Posted On 2026-08-03 05:58:15

Readmore >
Image 1

60 వేలు ఇచ్చి వివాహం చేసు కున్నాడు...తెల్లారే సరికి పెట్టె బేడా సర్దుకుని ఊడయించిన నవవధువు

Posted On 2026-08-03 05:55:39

Readmore >
Image 1

ప్రతి ఇంట్లో తెలిసి ఉండాల్సిన 25 ముఖ్యమైన మందులు – ఉపయోగాలు, జాగ్రత్తలు

Posted On 2026-08-03 05:54:41

Readmore >
Image 1

అంగరంగ వైభవంగా పాపకొల్లు గ్రామంలో ఆషాడ మాస బోనాల పండుగ కార్యక్రమం

Posted On 2026-08-03 05:49:18

Readmore >
Image 1

బిజెపి నాయకత్వంపై నమ్మకంతో పనిచేస్తా... రమేష్ యాదవ్

Posted On 2026-08-02 15:18:04

Readmore >