| Daily భారత్
Logo




హోటల్‌లో డ్రగ్స్ పార్టీ

News

Posted on 2024-02-26 08:14:13

Share: Share


హోటల్‌లో డ్రగ్స్ పార్టీ

రాడిసన్ హోటల్‌లో డ్రగ్స్ పార్టీ

డైలీ భారత్, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో డ్రగ్స్‌ భూతాన్ని తరిమికొట్టేందుకు పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నా మత్తుపదార్థాలను సరఫరా చేసే కేటుగాళ్లలో మార్పు రావడం లేదు. తాజాగా, గచ్చిబౌలిలోని ఓ స్టార్ హోటల్‌లో డ్రగ్స్ కలకలం రేగింది. రాడిసన్ హోటల్‌లో డ్రగ్స్‌ పార్టీ జరుపుకుంటున్న యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. స్టార్ హోటల్‌‌లో పట్టుబడిన వారిలో ప్రముఖ బీజేపీ నేత కుమారుడితో పాటు వ్యాపారవేత్త కుమారుడు కూడా ఉన్నారు. ఈ పార్టీలో డ్రగ్స్, మద్యం ఏరులై పారినట్టు తెలుస్తోంది.

పార్టీలో యువకులు పెద్ద ఎత్తున డ్రగ్స్ తీసుకున్నారు. పక్కా సమాచారంతో రాడిసన్ హోటల్‌పై దాడి చేసిన పోలీసులు... డ్రగ్స్ తీసుకున్నట్టు గుర్తించి ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద పెద్ద మొత్తంలో కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో ప్రముఖ వ్యాపారవేత్తతో పాటు బీజేపీ నాయకుడి కుమారుడు ఉండటం గమనార్హం.

కాగా, 2009 ఎన్నికల్లో హైదరాబాద్ నగర పరిధిలోని ఓ నియోజకవర్గం నుంచి సదరు నేత బీజేపీ అభ్యర్థిగా పోటీచేశారు. ఆ హోటల్ కూడా ఆయనదేనని సమాచారం. మూడు రోజులుగా ఈ ముగ్గురూ పార్టీ చేసుకుంటున్నట్టు సమాచారం.ముగ్గురు యువకులనూ పోలీసులు విచారిస్తున్నారు. ఈ పార్టీలో ఇంకా ఎవరెవరు పాల్గొన్నారని ఆరా తీస్తున్నారు.

Image 1

170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర

Posted On 2026-08-03 18:44:40

Readmore >
Image 1

వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్

Posted On 2026-08-03 16:58:20

Readmore >
Image 1

వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ

Posted On 2026-08-03 14:31:13

Readmore >
Image 1

చంద్రంపేట ఉన్నత పాఠశాలలో అత్యంత వైభవంగా బోనాల పండుగ

Posted On 2026-08-03 14:16:26

Readmore >
Image 1

హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్ "సామాజిక న్యాయ తెలంగాణ – సంకల్ప సభ"

Posted On 2026-08-03 14:09:30

Readmore >
Image 1

చిట్టీల పేరుతో ఐదు కోట్ల రూపాయలు ముంచి పరార్

Posted On 2026-08-03 05:58:15

Readmore >
Image 1

60 వేలు ఇచ్చి వివాహం చేసు కున్నాడు...తెల్లారే సరికి పెట్టె బేడా సర్దుకుని ఊడయించిన నవవధువు

Posted On 2026-08-03 05:55:39

Readmore >
Image 1

ప్రతి ఇంట్లో తెలిసి ఉండాల్సిన 25 ముఖ్యమైన మందులు – ఉపయోగాలు, జాగ్రత్తలు

Posted On 2026-08-03 05:54:41

Readmore >
Image 1

అంగరంగ వైభవంగా పాపకొల్లు గ్రామంలో ఆషాడ మాస బోనాల పండుగ కార్యక్రమం

Posted On 2026-08-03 05:49:18

Readmore >
Image 1

బిజెపి నాయకత్వంపై నమ్మకంతో పనిచేస్తా... రమేష్ యాదవ్

Posted On 2026-08-02 15:18:04

Readmore >