ఈ ఖాకీలకు ఏమైంది?.. హైదరాబాద్‌లో
డైలీ భారత్,(మియాపూర్): పంజాగుట్ట సీఐ సస్పెండ్ అయి రిమాండ్ కు పోయిన విషయం మరువక ముందే మరో సీఐపై సస్పెన్షన్ వేటు పడింది. మియాపూర్ సీఐ ప్రేమ్ కుమార్‌ను సస్పెండ్ చేస్తూ సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి ఆదేశాలు జారీ చేశారు. ఓ కేసుకు సంబంధించి పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారనే కారణంతో సీఐపై సస్పెన్షన్ వేటు పడింది.
అసలేం జరిగిందంటే..
భర్త వేధిస్తున్నాడంటూ ఓ మహిళ మియార్‌పూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వచ్చింది. అయితే పోలీస్ స్టేషన్‌కు వచ్చిన మహిళ పట్ల మియాపూర్ ఇన్‌స్పెక్టర్ ప్రేమ్ కుమార్ అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ విషయంపై సదరు మహిళ.. సైబరాబాద్ పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. మహిళ ఫిర్యాదుపై ఉన్నతాధికారులు విచారణ చేయగా ఇన్‌స్పెక్టర్ ప్రేమ్ కుమార్ రాసలీలల బాగోతం బయటపడింది. లోతుగా విచారణ చేపట్టిన సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి.. ఇన్‌స్పెక్టర్ ప్రేమ్ కుమార్‌ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
వరుస సస్పెన్షలు... పోలీస్ శాఖలో జరుగుతోంది?
కాగా.. తెలంగాణలో వరుసగా సీఐల సస్పెన్షన్ వ్యవహారం కలకలం రేపుతోంది. విధులు సరిగ్గా నిర్వర్తించని పలువురు సీఐలను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఇటీవల బోధన మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడి కేసుకు సంబంధించి పంజాగుట్ట సీఐ దుర్గారావుపై సస్పెన్షన్ వేటు పడటంతో పాటు కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితులను తప్పించేందుకు దుర్గారావు కీలకంగా వ్యవహరించినట్టుగా పోలీసులు తేల్చటంతో పాటు ఆయనను సస్సెండ్ చేశారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న దుర్గారావును నిన్న (సోమవారం) గుంతకల్ రైల్వేస్టేషన్‌లో పోలీసులకు చిక్కారు. అలాగే ఇదే కేసులో బోదన్ సీఐ ప్రేమ్‌కుమార్‌పై సస్పెన్షన్ వేటు పడటంతో పాటు... అరెస్ట్ అయ్యాడు.
ఇటు గోపాలపురం సీఐ మురళీధర్, ఎస్‌ఐ దీక్షిత్ రెడ్డిని హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి సస్పెండ్ చేశారు. గోపాలపురంలో స్థిరాస్తి వ్యాపారి హత్య కేసులో సరిగా విచారణ జరుపలేదని ఇద్దరిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే పటాన్‌చెరు సీఐ లాలూనాయక్‌పై కూడా సస్పెన్షన్ వేటు పడింది. విధినిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించి ఓ వ్యక్తి మరణానికి కారణమయ్యారంటూ సీఐని సస్పెండ్ చేస్తూ ఎస్పీ రూపేశ్ ఉత్తర్వులు జారీ చేశారు.