బాల్క సుమన్ ను బట్టలూడదీసి కొడతాం
ఏం చేసి ఎంపీ, ఎమ్మెల్యే అయ్యావో మాకు తెలుసు
తెలంగాణకు బూతు నేర్పిన నేత కేసిఆర్
వైయస్ జగన్ ను ఇంటికి పిలిచి రాయలసీమకు నీరు ఇచ్చిన రండ కేసీఆర్
నల్లమల గడ్డపై పుట్టిన పులిబిడ్డ రేవంత్ రెడ్డి
బావ బామ్మర్దులకు సిగ్గు, లజ్జ లేదు
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా బ్యూరో: తెలంగాణ నల్లమల్ల గడ్డపై పుట్టిన పులిబిడ్డ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ప్రజా పాలన పేరుతో రాష్ట్ర ప్రజలకు ఆదర్శవంతమైన పాలన అందిస్తున్న ముఖ్యమంత్రిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ను కనిపిస్తే బట్టలూడదీసి కొడతామని ఆదివాసి కాంగ్రెస్ రాష్ట్ర కోఆర్డినేటర్ "పి. రఘ" హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో పిసిసి సభ్యులు మొహమ్మద్ అలీ ఖాన్ బాబర్, కొత్తూరు మండల పార్టీ అధ్యక్షులు హరినాథ్ రెడ్డి, పట్టణ నాయకుడు చెంది తిరుపతి రెడ్డి, యువ నాయకులు ముబారక్ అలీ ఖాన్, సీనియర్ నాయకులు మహబూబ్, సయ్యద్ ఖదీర్, ఉపసర్పంచ్ సీతారాం, జాంగారి రవి, రాజు నాయక్, జంగయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రఘు మీడియాతో మాట్లాడుతూ.. అతను బాల్క సుమన్ కాదు "బాడకవ్" సుమన్ అంటూ తీవ్రంగా గద్దించారు. బాల్క సుమన్ ఏం చేసి ఎమ్మెల్యే, ఎంపీ అయ్యాడో ఎలా అక్రమ ఆస్తులు సంపాదించాడో మొత్తం చిట్టా బయటపెడతామని అన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సాగు నీటి పేరిట జీవో నెంబర్ 203తో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ తో కుమ్మక్కై వైఎస్ జగన్ హైదరాబాద్ లో సమావేశమై 8 టిఎంసిల నీరు తీసుకుపోయి దానికి బాధ్యుడు కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. తెలంగాణకు బూతు మాటలు, పదాలు నేర్పించిన ఘనత కేసిఆర్ కె దక్కుతుందని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని కెసిఆర్ ఒక్కడే తెచ్చినట్టు దొరల గడికి చెప్పులు మోస్తున్న బాల్క సుమన్ ముందు నిజమైన ఉద్యమకారులు 1200 మంది ప్రాణాలర్పిస్తే కనిపించట్లేదా అని ప్రశ్నించారు. కెసిఆర్ కుటుంబ సభ్యులు హరీష్ రావు కవిత కేటీఆర్ జోగినిపల్లి సంతోష్ తదితరులను ఉద్యమకారుల హోదాలో అధికారం కట్టబెట్టి తెలంగాణ ప్రజల సొత్తును దోచుకున్న దొంగలు కారా అని ప్రశ్నించారు. పదో తరగతి పరీక్ష పేపర్లు కూడా అమ్ముకున్న దరిద్రులు టిఆర్ఎస్ నాయకులు కాదా అని ఘాటుగా విమర్శించారు. నిరుద్యోగుల పొట్ట కొట్టి పేపర్ లీకేజీ చేసిన ఘనులు కేటీఆర్ కవిత అని అన్నారు. ప్రజలకు మంత్రులకు ఎమ్మెల్యేలకు ఎవరికి కలవకుండా నిత్యం ఫామ్ హౌస్ లో కాలక్షేపం చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన కేసీఆర్ నిజమైన రండ అంటూ తీవ్ర పదజాలంతో దూషించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు కూడా కాకుండానే బావ బామ్మర్దులు హరీష్ రావు కేటీఆర్ లు తమ అక్కసు ప్రభుత్వంపై వెల్లబోసుకుంటున్నారని అన్నారు. బావబామ్మర్దులకు సిగ్గు లజ్జ లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంపై నిత్యం తప్పుడు ప్రచారం చేయడమే వీరి పని అయిందని అన్నారు.
తెలంగాణ సొత్తు దోచుకుని అధికారాన్ని కుటుంబానికి కట్టబెట్టిన కేసీఆర్ ను తప్పకుండా రండ అంటామని హెచ్చరించారు అదేవిధంగా తెలంగాణ ధర్నా చౌక్ ను ఎత్తివేసిన ఉన్మాది కేసీఆర్ అని అన్నారు. ఇది బాల్క సుమన్ కు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. బాల్క సుమన్ తెలంగాణలో బయటికి వస్తే బట్టలు ఊడదీసి కొడతామని తీవ్రంగా హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక తెలంగాణలో ప్రజలకు ఉద్యోగులకు కర్షకులకు కార్మికులకు అందరికీ స్వేచ్ఛ లభించింది అని అన్నారు. రండ అనే పదం గతంలో ముఖ్యమంత్రికి కేసిఆర్ వాడారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఉద్దేశించి రాష్ట్రానికి నిధులు తేలేని రండ అని విమర్శించారని, ఆయన మాట్లాడితే పొగడ్త ఇతరులు మాట్లాడితే విమర్శ ఎలా అవుతుందని రఘు ప్రశ్నించారు. దొరల గడికి ఊడిగం చేస్తూ వారు పెట్టిన ఎంగిలి కూడు తిని అడ్డంగా బలిసిన బాల్క సుమన్ ఒకసారి తన మొఖం అద్దంలో చూసుకోవాలని ఎద్దేవా చేశారు. సుమన్ కు ఎమ్మెల్యే, ఎంపీ టికెట్స్ కేటీఆర్ ఎందుకు ఇచ్చారో అందరికీ తెలుసు అని బాల్క సుమన్ రియల్ లైఫ్ గురించి కథలు కథలుగా చెప్పుకుంటారని ఎద్దేవా చేశారు. బాల్క సుమన్ ను తెలంగాణలో తరిమికొడతామని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తెలంగాణకు ఒకటవ తారీకు ఉద్యోగస్తులకు జీతాలు వస్తున్నాయని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో టీజీ అని రాష్ట్రాన్ని సంబోధించి ప్రభుత్వం వచ్చాక ఎందుకు టీఎస్ పెట్టారని ప్రశ్నించారు. టిఆర్ఎస్ లో టీఎస్ తెలంగాణ సమితి అనే విధంగా అర్థం వచ్చేట్టు స్వార్థం కోసం టీజీ పెట్టలేదని అన్నారు. అమరుల స్వప్నం సాకారం అయినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రానికి టిజీ పెట్టారని అన్నారు. గత పది సంవత్సరాలు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యుల సంకనాకిన బాల్క సుమన్ జర భద్రంగా ఉండాలని హెచ్చరించారు. ఈ మీడియా సమావేశంలో రాజు నాయక్ సతీష్ హరినాథ్ రెడ్డి ప్రవీణ్ బచ్చలి నరేష్ తదితరులు పాల్గొన్నారు.