| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఘనంగా వి హెచ్ పి ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఘనంగా వి హెచ్ పి ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

డైలీ భారత్, నిజామాబాద్: వికలాంగుల హక్కుల పోరాట సమితి  19 వ ఆవిర్భావ దినోత్సవం శుక్రవారం నవీపేట్ మండల కేంద్రంలో విహెచ్పిఎస్ మండల అధ్యక్షులు భయ్యా సతీష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశం  మాట్లాడుతూ  రెండు రాష్ట్రాలలో మన జెండా ఆవిష్కరణ విజయం చేయాలని ప్రతి జిల్లాలో మండలాలలో గ్రామాల్లో జెండా ఎగరవేయడం జరుగుతుందన్నారు.

పద్మశ్రీ మందకృష్ణ మాదిగ మన వికలాంగుల హక్కుల పోరాట సమితి 2007 ఆగస్టు 28వ తేదీన స్థాపించడం జరిగింది. ఎవరు చేయలేని విధంగా మన దివ్యంగుల కోసం మందకృష్ణ అన్న జీవితాన్ని అంకితం చేశాడు మన బాధలను కష్టాలను నెరవేర్చే కొంటూ 19 సంవత్సరాల నిరీక్షణ పోరాటంలో మన దివ్యంగులకు అన్ని సంక్షేమ పథకాలను నెరవేర విధంగా చూసి అందరికీ సమాజంలో అన్ని హక్కులు ఉన్నాయి అన్నట్టుగా మనకు కూడా హక్కులు ఉన్నాయని గుర్తించిన ఈ దేశంలో మొట్టమొదటి వ్యక్తి ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ సంవత్సరాల తరబడి మన హక్కుల కోసం  ప్రభుత్వాలతో యుద్ధం చేస్తూ మన పెన్షన్ను 416 వరకు చేసి మనకు నెల రోజులు కడుపునిండా అన్నం ఉండే విధంగా చూసిన గొప్ప వ్యక్తి కావున మన జెండాను మనం గౌరవంగా ఎగరవేయాలని కోరుకుంటున్నానని అన్నారు.

అదేవిధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మూడు సంవత్సరాలు గడిచిన కానీ ఇప్పటివరకు 6 గ్యారెంటీలను హామీగా ఇచ్చి మనకు ఒకటి కూడా అమలు చేయలేరు అదే విధంగా పక్క రాష్ట్రంలో పదవిలోకి రాగానే అతను ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాడు కానీ ఈ ప్రభుత్వం చేస్తున్న అన్యాయం గా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో  బోధన్ ఇన్చార్జి ఆకారం రమేష్ మాదిగ, జశ్వంత్ కుమార్ మాదిగ, దండోరా గంగాధర్ మాదిగ, విహెచ్పిఎస్ మండల అధ్యక్షులు బయ్య సతీష్ , మండల కార్యదర్శి గంగాధర్ (పంతులు) , వెంకటేష్ ,రాము, లక్ష్మి , గౌతమి , లక్ష్మణ్ , సంజీవ్, ముజాహిద్, తదితరులు పాల్గొన్నారు

Previous జన్ ధన్ ఖాతాల్లో రూ.3.17లక్షల కోట్లు
Next నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు
ADVERTISEMENT