డైలీ భారత్, కామారెడ్డి : విశ్వసనీయ సమాచారం మేరకు బీబీపేట్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది యాదారం గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో ఆకస్మికంగా దాడి నిర్వహించారు.
ఈ దాడిలో పేకాట ఆడుతున్న నలుగురిపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టారు. నిందితుల వద్ద నుండి రూ.7,662 నగదు, 5 మొబైల్ ఫోన్లు, 3 మోటార్ సైకిళ్లు, 52 పేక ముక్కలు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
స్వాధీనం చేసుకున్న వస్తువులు:
నగదు – రూ.7,662
మొబైల్ ఫోన్లు – 5
మోటార్ సైకిళ్లు – 3
జిల్లా ఎస్పీ మాట్లాడుతూ...
జూదం ఒక ప్రమాదకరమైన వ్యసనమని, దీనికి బానిసైతే వ్యక్తిగత, కుటుంబ, ఆర్థిక జీవితాలు తీవ్రంగా దెబ్బతింటాయని జిల్లా ఎస్పీ తెలిపారు. త్వరగా డబ్బు సంపాదించాలనే ఆశతో చట్టవిరుద్ధమైన పేకాట, జూదం వంటి కార్యకలాపాలకు పాల్పడితే చివరికి చట్టపరమైన చర్యలు, ఆర్థిక నష్టాలు, కుటుంబ సమస్యలే మిగులుతాయని హెచ్చరించారు.
యువత తమ భవిష్యత్తుపై దృష్టి పెట్టాలని, జూదం వంటి దురలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. ఎక్కడైనా పేకాట లేదా జూదం జరుగుతున్నట్లు సమాచారం తెలిసిన వెంటనే డయల్-100 లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని జిల్లా ఎస్పీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.