డైలీ భారత్, ఇంటర్నెట్ డెస్క్: జిల్లా జడ్జీల పదవీ విరమణ వయసును 61 ఏళ్లకు పెంచే అంశాన్ని పరిశీలించాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సుప్రీంకోర్టు సూచించింది. సంబంధిత హైకోర్టులతో చర్చించి రెండు వారాల్లోగా నిర్ణయం తెలపాలని సీజేఐ ధర్మాసనం ఆదేశించింది.
దేశవ్యాప్తంగా ఏకరూప విధానం కోరుతూ దాఖలైన పిటిషన్పై విచారణ సందర్భంగా ఈ ఆదేశాలిచ్చారు. ప్రస్తుతం హైకోర్టు జడ్జీల వయసు 62, సుప్రీంకోర్టు జడ్జీల వయసు 65 ఏళ్లుగా ఉంది.