| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

రాజన్న సిరిసిల్ల : అంగన్వాడీల ఆకస్మిక తనిఖీ... పోషకాహారంపై కలెక్టర్ కీలక ఆదేశాలు

రాజన్న సిరిసిల్ల : అంగన్వాడీల ఆకస్మిక తనిఖీ... పోషకాహారంపై కలెక్టర్ కీలక ఆదేశాలు

డైలీ భారత్, సిరిసిల్ల: జిల్లాలో చిన్నారుల పోషణ, అంగన్వాడీ సేవలపై జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రత్యేక దృష్టి సారించారు. 

శుక్రవారం సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని రగుడు అంగన్వాడీ కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రంలో నిల్వ ఉన్న కోడిగుడ్లు, బాలామృతం, పిల్లలకు సిద్ధం చేసిన ఆహారం, రోజూ హాజరయ్యే పిల్లల సంఖ్యను క్షుణ్ణంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు కోడిగుడ్లు, బాలామృతంతో సహా పోషకాహారాన్ని క్రమం తప్పకుండా అందించాలన్నారు. 

చిన్నారులు ప్రతిరోజూ అంగన్వాడీకి వచ్చేలా తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించాలని, ఆటపాటల ద్వారా పిల్లలకు బోధన అందించాలని సిబ్బందికి సూచించారు. గర్భిణులు, బాలింతలు అంగన్వాడీ కేంద్రాల సేవలను పూర్తిగా వినియోగించుకుని, ఇచ్చే పోషకాహారాన్ని తప్పకుండా తీసుకోవాలని ఆమె కోరారు.

పిల్లల ఆరోగ్యం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వద్దని, ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు సక్రమంగా అందాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

#RajannaSircilla #GarimaAgarwal #Anganwadi #Telangana #Collector

Previous నేటి రోజుల్లో కూడా దళితులపై చిన్న చూపు సరికాదు..
Next సిరిసిల్లలో ఫుడ్ పాయిజన్... బాధితులను పరామర్శించిన డీఎంహెచ్‌వో ఏంజెలా ఆల్ఫ్రెడ్
ADVERTISEMENT