Posted on 2026-07-14 11:38:49
డైలీ భారత్, వినుకొండ:కుటుంబ కలహాలు పల్నాడు జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపాయి. క్షణికావేశంలో తీసుకున్న ఒక నిర్ణయం ఇద్దరు పసిపిల్లల ప్రాణాలను బలిగొనడంతో పాటు ఒక తల్లి బలవన్మరణానికి కారణమైంది. వినుకొండ మండలం విఠంరాజుపల్లి గ్రామంలో ఈ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది.
విఠంరాజుపల్లి గ్రామానికి చెందిన నక్కా భారతి (24) కి, పాల వ్యాన్ డ్రైవర్‌గా పనిచేసే సునీల్ రెడ్డితో ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి తేజేష్ రెడ్డి (6), హేమనాథ నాగిరెడ్డి (4) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే, గత కొంతకాలంగా భర్త వ్యసనాలకు బానిసై కుటుంబాన్ని పట్టించుకోకపోవడంతో దంపతుల మధ్య తరచూ తీవ్రమైన గొడవలు జరుగుతుండేవి.
ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన భారతి.. సోమవారం రాత్రి భర్త డ్యూటీకి వెళ్ళిన తర్వాత దారుణానికి ఒడిగట్టింది. తన ఇద్దరు బిడ్డలకు ఆహారంలో విషం ఇచ్చి హతమార్చింది. అనంతరం ఆమె కూడా ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మంగళవారం ఉదయం ఇరుగుపొరుగు వారు గమనించేసరికి ముగ్గురూ నిర్జీవంగా పడి ఉన్నారు.
ఘటనా స్థలంలో భారతి రాసిన ఒక చిన్న ఆత్మహత్య లేఖ లభ్యమైంది. తన చావుకు ఎవరూ బాధ్యులు కారని ఆమె అందులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు.
సమాచారం అందుకున్న వినుకొండ రూరల్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భారతి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఒకే ఇంట్లో ముగ్గురు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర
Posted On 2026-08-03 18:44:40
Readmore >
వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్
Posted On 2026-08-03 16:58:20
Readmore >
వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ
Posted On 2026-08-03 14:31:13
Readmore >
60 వేలు ఇచ్చి వివాహం చేసు కున్నాడు...తెల్లారే సరికి పెట్టె బేడా సర్దుకుని ఊడయించిన నవవధువు
Posted On 2026-08-03 05:55:39
Readmore >
ప్రతి ఇంట్లో తెలిసి ఉండాల్సిన 25 ముఖ్యమైన మందులు – ఉపయోగాలు, జాగ్రత్తలు
Posted On 2026-08-03 05:54:41
Readmore >
అంగరంగ వైభవంగా పాపకొల్లు గ్రామంలో ఆషాడ మాస బోనాల పండుగ కార్యక్రమం
Posted On 2026-08-03 05:49:18
Readmore >