Posted on 2026-06-11 20:54:40
స్క్రాప్ దుకాణాల నిర్వాహకులు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి
చోరీకి సంబంధించిన సొత్తు కొనుగోలు చేసినా, విక్రయించినా కఠిన చర్యలు
జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: జిల్లాలో నేరాల నియంత్రణ, చోరీ సొత్తు కొనుగోలు మరియు విక్రయాలను అరికట్టేడమే లక్ష్యంతో జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో గురువారం జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని స్క్రాప్ దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు.
ఈతనిఖీల్లో భాగంగా స్క్రాప్ దుకాణాల యజమానులు కొనుగోలు చేస్తున్న వస్తువులకు సంబంధించిన రికార్డులు, బిల్లులు, కొనుగోలుదారుల వివరాలను పరిశీలించి , అనుమానాస్పదంగా కనిపించే వస్తువులు, చోరీ సొత్తు కొనుగోలు చేయవద్దని, ప్రతి వస్తువుకు సంబంధించిన పూర్తి వివరాలను నమోదు చేయాలని సూచించారు.
తనిఖీల్లో భాగంగా ఇప్పటి వరకు తంగళ్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ద్విచక్ర వాహనం, సర్వీస్ వైర్ కట్టలు, గంభీరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో 10 మోటార్లు, 03 కాపర్ వైర్ బెండలు దొరుకగా, విటికి సంబంధించి సరైన ఆధారాలు,పత్రాలు సమర్పించలేకపోవడంతో వాటిని స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు.అనంతరం సంబంధిత వ్యక్తులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్పీ గారు తెలిపారు.
ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ...స్క్రాప్ దుకాణాల నిర్వాహకులు తప్పనిసరిగా కొనుగోలు, విక్రయాల రిజిస్టర్ నిర్వహించాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువుల గురించి వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని సూచించారు.నిబంధనలను ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ప్రజలు కూడా చోరీ సొత్తు కొనుగోలు, విక్రయాలకు పాల్పడకుండా పోలీసులకు సహకరించాలని కోరారు.
బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి
Posted On 2026-06-12 22:38:10
Readmore >
పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే
Posted On 2026-06-12 21:45:03
Readmore >
తాళిపేరు ఎడమ కాలువలో నీటి ప్రవాహానికి అడ్డంకులు తొలగించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-06-12 20:07:23
Readmore >
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-12 18:52:12
Readmore >
ప్రభుత్వ పాఠశాలల్లోనే తమ పిల్లల్ని చదివించండి : సర్పంచ్ దుంపల చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-06-12 18:48:24
Readmore >
హనీ ట్రాప్ : టిండర్ యాప్ లో 52 లక్షలు పోగొట్టుకున్న మహిళ న్యాయమూర్తి
Posted On 2026-06-12 12:51:28
Readmore >