| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

అంబులెన్సు లేక భుజాలపై మృతదేహం ..

అంబులెన్సు లేక భుజాలపై మృతదేహం ..

ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉండి ఏమి లాభం

అంబులెన్సు లేక భుజాలపై మృతదేహం ..

ఆసుపత్రి వద్ద ఆవేదన

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో అత్యంత హృదయ విదారకమైన సంఘటన చోటుచేసుకుంది. భద్రాచలం పట్టణానికి చెందిన ఓ వృద్ధుడు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చనిపోతే కనీసం ఉచితంగా ఇవ్వవలసిన అంబులెన్స్ సైతం లేకపోవడం, లేదా ఇవ్వకపోవడంతో చనిపోయిన వ్యక్తిని తీసుకొని భుజాలపై వేసుకొని ఇంటికి వెళ్తున్న కుటుంబ సభ్యులను చూస్తే ఈ సమాజంలో మనం ఎందుకు బ్రతుకుతున్నామా అనేది అర్థం కాని పరిస్థితి. చనిపోయిన వ్యక్తి బాడీని భుజాలపై మోసుకు వెళ్తుంటే ప్రభుత్వ ఆసుపత్రి యంత్రాంగం నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఇటువంటి సంఘటనలు గతంలో ఇతర రాష్ట్రాలలో జరిగినప్పుడు అయ్యో అని బాధపడ్డాము. కానీ ఈరోజు అది మన వరకు వచ్చిందంటే ఈ ప్రభుత్వం, ప్రభుత్వంలోని అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సంఘటనకు సంబంధించి కారణమైన ప్రతి ఒక్కరిని సస్పెండ్ చేయాలి. ప్రభుత్వ ఆసుపత్రిని ప్రతి రోజు మన జిల్లా కలెక్టర్ తనిఖీ చేస్తూ మెరుగైన వైద్యం అందించండి సకల సదుపాయాలు కల్పించండి అని ఎంత మొత్తుకున్నా సిబ్బంది ప్రవర్తనలో మార్పులు జరగకపోవడం చాలా బాధాకరమైన విషయం ఇటువంటి సంఘటనలో పురావృత్తం కాకుండా ఉండాలని అధికారులను వేడుకుంటున్నాము

ఈ ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

Previous సీఎంఆర్‌ఎఫ్ ద్వారా ఎల్టీసీ మంజూరు పత్రం అందజేత
Next అక్రమ రేషన్ పట్టివేత...
ADVERTISEMENT