| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

రాజన్న సిరిసిల్ల జిల్లా : విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో కోళ్ల ఫారమ్ దగ్ధం..

రాజన్న సిరిసిల్ల జిల్లా : విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో కోళ్ల ఫారమ్ దగ్ధం..

సుమారు రూ. 8 లక్షల ఆస్తి నష్టం...

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామ శివారులో శుక్రవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక కోళ్ల ఫారమ్ పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో ఫారమ్‌లోని సామగ్రితో పాటు వందలాది కోళ్లు సజీవ దహనమయ్యాయి.అగ్రహారం గ్రామానికి చెందిన ఆంజనేయులు ఈ కోళ్ల ఫారమ్‌ను నిర్వహిస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు చెలరేగి వేగంగా విస్తరించాయి. గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే, అప్పటికే ఫారమ్ పూర్తిగా కాలిపోవడంతో సుమారు రూ. 8 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు బాధితుడు ఆంజనేయులు కన్నీటి పర్యంతమయ్యారు.

Previous గంజాయి అక్రమ రవాణాపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసుల ఉక్కుపాదం
Next కొత్తపల్లి - మనోహరాబాద్ రైల్వే లైన్ పనులు పూర్తి చేయాలి
ADVERTISEMENT