| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

లారీ ఇంజిన్ లో మంటలు..8 కొత్త కార్లు దగ్ధం..

లారీ ఇంజిన్ లో మంటలు..8 కొత్త కార్లు దగ్ధం..

డైలీ భారత్, మెదక్: మెదక్ జిల్లా తూప్రాన్ శివారులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 8 కొత్త కార్లు ద‌గ్ధం అయ్యాయి. మహారాష్ట్రలోని నాగ్‌పూర్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడకు 8 కొత్త కార్లను తరలిస్తున్నారు. తూప్రాన్ శివారుకు చేరుకోగానే లారీ ఇంజిన్ నుంచి మంటలు రావడం గమనించిన డ్రైవర్ అప్రమత్తమయ్యాడు. వెంటనే లారీని రోడ్డుపక్కకు నిలిపివేసినా.. క్షణాల్లోనే మంటలు భారీగా వ్యాపించాయి. మొదట క్యాబిన్‌లో చెలరేగిన మంటలు.. తర్వాత కంటెయినర్ వెనుక భాగంలోని కార్లకు వ్యాపించాయి. రామాయంపేట నుంచి చేరుకున్న ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే అప్పటికే కంటెయినర్‌తో పాటు అందులోని 8 కొత్త కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి.

Previous గొల్లగూడెం గ్రామపంచాయతీలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా ?
Next గంజాయి అక్రమ రవాణాపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసుల ఉక్కుపాదం
ADVERTISEMENT