మెడికల్ క్యాంప్ లు,Ors,మజ్జిగ పంపిణీ ఏర్పాటు చేయాలీ
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం బిజెపి నాయకులు తంబళ్ల రవి మాట్లాడుతూ అశ్వరావుపేట నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఎండ తీవ్రత అధికంగా ఉండటం వల్ల పంచాయతీ కార్యదర్శిలు వేసవి తాపం తగ్గించడం కోసం రహదారిపై నీరు కొట్టించటం, మెడికల్ క్యాంపులు,మజ్జిగ,ఓ ఆర్ ఎస్ వంటివి ప్రజలకు ఉచితంగా అందించే చర్యలు తీసుకుంటే ప్రజలకు,వాహనదారులకు,వ్యాపారులకు కొంత ఉపశమనం కలిగించినవారు అవుతారు అని,ముఖ్యంగా ఎండ తీవ్రత చిన్న పిల్లలు,పెద్ద వయసు వారి మీద ప్రభావం చూపే అవకాశం ఉన్నందున ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని కోరారు