| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

బంగాళాఖాతంలో భారీ మేఘాల ప్రభావం.. పలు రాష్ట్రాలకు హెచ్చరికలు

బంగాళాఖాతంలో భారీ మేఘాల ప్రభావం.. పలు రాష్ట్రాలకు హెచ్చరికలు

డైలీ భారత్, ఇంటర్నెట్ డెస్క్: బంగాళాఖాతం, అరేబియా సముద్రం ప్రభావంతో దేశ వ్యాప్తంగా వాతావరణంలో భారీ మార్పులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

దాదాపు 3,000 కిలోమీటర్ల మేర విస్తరించిన భారీ మేఘాల సమూహం ఉత్తర, తూర్పు భారతంపై ప్రభావం చూపే అవకాశముందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. 

బంగాళాఖాతంలో సముద్ర జలాలు అధికంగా వేడెక్కడం, బలమైన గాలులు కలవడంతో భారీ వర్షాలు, ఈదురుగాలులకు పరిస్థితులు అనుకూలిస్తున్నాయి.

భారీ వర్షాలు, పిడుగులు, ఈదురుగాలుల ముప్పు

సిక్కిం, ఉత్తర బెంగాల్‌, మేఘాలయ, ఒడిశా, జార్ఖండ్‌, పశ్చిమ బెంగాల్‌ ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి. 

కొన్ని ప్రాంతాల్లో తక్కువ సమయంలోనే అధిక వర్షపాతం నమోదై ఆకస్మిక వరదలు సంభవించే ప్రమాదం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. 

గంటకు 120 కిలోమీటర్లకు పైగా వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముండగా, పిడుగుపాట్లు కూడా ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. 

నగర ప్రాంతాల్లో రహదారులు జలమయం కావడం, రవాణా వ్యవస్థలకు అంతరాయం కలిగే పరిస్థితులు తలెత్తవచ్చని హెచ్చరిస్తున్నారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు

కొండ ప్రాంతాలకు వెళ్లే పర్యాటకులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. 

భారీ వర్షాల సమయంలో చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని, పిడుగుపాట్ల నుంచి జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. 

రైతులు పంటలను రక్షించుకునేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని, తీర ప్రాంత ప్రజలు అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. 

ప్రజలంతా అప్రమత్తంగా ఉండి సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Previous గోమతి నగర్ రైలులో దారుణం ఘటన...యువతిని ముక్కలుగా నరికి పెట్టెలో దాచారు ..!
Next రాష్ట్రంలో అవినీతి అధికారి.. రూ.100 కోట్ల ఆస్తులు!
ADVERTISEMENT