డైలీ భారత్, కామారెడ్డి : ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణి లో కలెక్టరేట్ సమావేశం మందిరం లో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, ACLB ఇంచార్జి NV గిరి, సీఈఓ చందర్ దరఖాస్తూదారుల నుండి అర్జీలను స్వీకరించారు.
ఈ సందర్బంగా స్వీకరించిన దరఖాస్తులను సంబంధిత జిల్లా అధికారులకు ఇస్తూ తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు.
ప్రతి సోమవారం డివిజన్ స్థాయిలో ప్రజావాణి నిర్వహించడం జరుగుతుందని జిల్లాలో ప్రజల సమస్యల పరిష్కారానికి నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రతి సోమవారం సంబంధిత డివిజన్ కేంద్రాల్లో నిర్వహించడం జరుగుతుందని,జిల్లా కలెక్టర్ తెలిపారు.
ఆయా డివిజన్‌లకు చెందిన ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను సంబంధిత ప్రజావాణి కార్యక్రమంలో సమర్పించి పరిష్కారం పొందాలని సూచించారు.
చిన్న చిన్న సమస్యల పరిష్కారం కోసం జిల్లా కేంద్రానికి రావాల్సిన అవసరం లేదని, తమకు సమీపంలోని డివిజన్ కేంద్రానికే వెళ్లి దరఖాస్తులు అందజేయవచ్చని కలెక్టర్ తెలిపారు.
ప్రజలకు సౌకర్యవంతంగా, వేగవంతంగా సేవలు అందించేందుకు ఈ విధానాన్ని అమలు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.
అధికారులు ప్రజల నుంచి వచ్చే వినతులను స్వీకరించి, సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుని త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.
ఈ ప్రజావాణి లో జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.