ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు
డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ వైద్యశాలలో సామల సుష్మ కు బి పాజిటివ్ రక్తం అవసరం కావడంతో సింగరాయ పల్లి గ్రామానికి చెందిన అధికం నిఖిల్ గౌడ్ సకాలంలో రక్తాన్ని అందజేసి ప్రాణదాతగా నిలవడం జరిగిందని ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలియజేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ వేసవి కాలం కావడం వలన రక్తనిధి కేంద్రాలలో రక్తం దొరకక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని యువత రక్తదానానికి ముందుకు రావాలని, రక్తానికి ప్రత్యామ్నాయ మార్గాలు లేవని స్వచ్ఛందంగా ముందుకు వచ్చే రక్తదాతల తోనే ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడవచ్చునని అన్నారు. రక్తదాత నిఖిల్ గౌడ్ కు అభినందనలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షుడు డాక్టర్ వేద ప్రకాష్ అధ్యక్షుడు జమీల్ హైమద్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ పుట్ల అనిల్ కుమార్,ఉపాధ్యక్షులు ఎర్రం చంద్రశేఖర్,పర్ష వెంకటరమణ, సలహాదారులు జలిగామ శ్రీకాంత్, అంకం బాలకిషన్ లు పాల్గొనడం జరిగింది.