| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ట్రాఫిక్ పెండింగ్ చలాన్ల వ్యవహారం.. డీజీపీకి హైకోర్టు నోటీసులు

ట్రాఫిక్ పెండింగ్ చలాన్ల వ్యవహారం.. డీజీపీకి హైకోర్టు నోటీసులు

చలాన్లు చెల్లించకపోతే వాహనం సీజ్ చేయొద్దు

హైకోర్టు ఉత్తర్వులను పోలీసులు అమలు చేయడం లేదనీ వ్యాఖ్య

డైలీ భారత్ డెస్క్ : ట్రాఫిక్ పెండింగ్ చలాన్ల వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కోర్టుధిక్కరణ కింద డీజీపీ సీవీ ఆనంద్, మాజీ డీజీపీ శివధర్ రెడ్డి, ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్‌కు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. పెండింగ్ చలాన్‌లు ఉంటే వాహనాలు సీజ్ చేయొద్దని ఈ ఏడాది జనవరి 20న హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఏప్రిల్ 9న మల్లికార్జున అనే వ్యక్తి బైక్‌ను పోలీసులు సీజ్ చేశారు. హైకోర్టు ఉత్తర్వులను ధిక్కరించారని ఆరోపిస్తూ కోర్టుధిక్కరణ పిటిషన్ దాఖలైంది. హోంశాఖ సెక్రటరీ, డీజీపీ, ట్రాఫిక్ అదనపు సీపీ, రవాణా శాఖ కమిషనర్‌లను ప్రతివాదులుగా పిటిషనర్ చేర్చారు.

పిటిషనర్ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది విజయ్ గోపాల్.. హైకోర్టు ఉత్తర్వులను పోలీసులు అమలు చేయడం లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వాహనం ఆర్సీ బుక్‌ను M-Walletలో చూపించినా ట్రాఫిక్ పోలీసులు అంగీకరించడం లేదని న్యాయవాది తెలిపారు. ఈ క్రమంలో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే నెల 19కి హైకోర్టు వాయిదా వేసింది..

Previous గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళకు సకాలంలో రక్తం అందజేత
Next పత్రికా స్వేచ్ఛ… సమాజం ఊపిరి
ADVERTISEMENT