| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళకు సకాలంలో రక్తం అందజేత

గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళకు సకాలంలో రక్తం అందజేత

డైలీ భారత్, కామారెడ్డి : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన సౌమ్య (28) కి గాంధీ వైద్యశాల హైదరాబాద్ లో ఓ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారి కుటుంబ సభ్యులు సంప్రదించడంతో వారికి కావలసిన రక్తాన్ని కాటేదాన్ చెందిన రాజు మానవతా దృక్పథంతో వెంటనే స్పందించి సకాలంలో రక్తాన్ని అందజేయడం జరిగిందని ఐ వి ఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలియజేశారు.వేసవికాలం కావడం వలన వివిధ చికిత్సల నిమిత్తమై వచ్చే కావలసిన రక్తం దొరకక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని వారికి కావాల్సిన రక్తాన్ని అందజేయడానికి ఎల్లవేళలా కామారెడ్డి రక్తదాతల సమూహం సిద్ధంగా ఉందని తెలియజేశారు. రక్తదాత రాజు మరియు సహకరించిన ఐవిఎఫ్ మల్లేష్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.

Previous రాజన్న సిరిసిల్ల జిల్లా : హత్య కేసులో నలుగురు నిందుతులకు యావజ్జీవ కారాగార (జీవిత ఖైదు) శిక్ష
Next ట్రాఫిక్ పెండింగ్ చలాన్ల వ్యవహారం.. డీజీపీకి హైకోర్టు నోటీసులు
ADVERTISEMENT