Posted on 2026-04-07 01:20:15
డైలీ భారత్, హైదరాబాద్: చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలో బహిరంగ ప్రదేశంలో న్యూసెన్స్ చేస్తూ, విధుల్లో ఉన్న పోలీసు అధికారులను అడ్డుకున్న ముగ్గురు వ్యక్తులకు గౌరవనీయ నాంపల్లి కోర్టు (I స్పెషల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్) 2 రోజుల జైలు శిక్ష మరియు తలా ₹500/- జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది.
చార్మినార్ పరిసర ప్రాంతాల్లో నిందితులైన రజాక్ పాషా (25), హాజీ బిన్ అబ్దుల్లా (29), మరియు మహ్మద్ సాహిల్ (24) ప్రజలకు అసౌకర్యం కలిగిస్తూ విఘాతం కలిగిస్తున్నారు. చార్మినార్ ఎస్.ఐ బి. ప్రవీణ్ కుమార్ తన సిబ్బందితో కలిసి వారిని ప్రశ్నించగా, నిందితులు సహకరించకుండా దురుసుగా ప్రవర్తించారు. ముఖ్యంగా హాజీ బిన్ అబ్దుల్లా అనే వ్యక్తి పోలీసులపైకి దూసుకువచ్చి, వారి విధులకు ఆటంకం కలిగించారు.
దీనిపై చార్మినార్ పోలీసులు ఈ-పెట్టి కేసులు (61 B CP ACT & 292 BNS ACT కింద) నమోదు చేశారు. గౌరవ మేజిస్ట్రేట్ శ్రీ ఎం. భాస్కర్ గారు 06-04-2026న ఈ కేసులను (STC No- 1837, 1838, 1839/2026) విచారించి, నేరం నిరూపితమైనందున నిందితులకు రెండు రోజుల జైలు శిక్ష విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
బహిరంగ ప్రదేశాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై మరియు పోలీసుల విధులను అడ్డుకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా చార్మినార్ ఇన్‌స్పెక్టర్ టి. రాంబాబు హెచ్చరించారు.
కామారెడ్డి జిల్లాలో సిసిఎస్ పోలీసుల మెరుపు దాడి : అక్రమ జూదం ఆడుతున్న నలుగురి అరెస్ట్
Posted On 2026-04-09 15:19:40
Readmore >
చిన్నారుల అసాధారణ ప్రతిభ : భగవద్గీత పఠనంలో "ఎలైట్ వరల్డ్ రికార్డ్" సాధించిన అన్నదమ్ములు
Posted On 2026-04-09 14:11:13
Readmore >
యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-09 06:18:50
Readmore >
తమిళనాడు ప్రధాన కార్యదర్శి గా తెలుగు వ్యక్తి ఎం.సాయికుమార్ బాధ్యతలు స్వీకారం
Posted On 2026-04-09 06:00:41
Readmore >