| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ముఖ్య అనుచరుడి పాడే మోసిన షబ్బీర్ అలీ

ముఖ్య అనుచరుడి పాడే మోసిన షబ్బీర్ అలీ

డైలీ భారత్, కామారెడ్డి: రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందిన మాజీ జెడ్పిటిసి ఫ్లోర్ లీడర్ నారెడ్డి మోహన్ రెడ్డి అంతిమయాత్రలో ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ అలీ షబ్బీర్ పాల్గొని తన మానవత్వాన్ని చాటుకున్నారు.

మోహన్ రెడ్డి చివరి మజిలీలో షబ్బీర్ అలీ వారి నివాసానికి చేరుకుని భౌతికకాయంపై పూలగుచ్చం ఉంచి నివాళులు అర్పించారు.

శోకసంద్రంలో ఉన్న కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు.

అనంతరం జరిగిన అంతిమయాత్రలో షబ్బీర్ అలీ స్వయంగా పాడే మోసి తన ముఖ్య అనుచరుడి పట్ల ఉన్న ఆత్మీయతను, అనుబంధాన్ని చాటుకున్నారు.  అందరితో కలిసి నడుస్తూ చివరి యాత్రలో పాల్గొనడం అక్కడున్న వారిని భావోద్వేగానికి గురి చేసింది.


ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ

మోహన్ రెడ్డి పార్టీకి నిబద్ధతతో పనిచేసిన మంచి నాయకుడు. ఆయన మరణం నాకు వ్యక్తిగతంగా తీరని లోటు. వారి కుటుంబానికి ఎల్లప్పుడూ నేను అండగా ఉంటాను” అని తెలిపారు.

Previous భద్రాచలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ
Next నిషేధిత హుక్కా అమ్మకాలపై సూర్యాపేట పోలీస్ ఉక్కుపాదం
ADVERTISEMENT