| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఎస్ ఈ కార్యాలయం ముందు కార్మికుల ధర్నా

ఎస్ ఈ కార్యాలయం ముందు కార్మికుల ధర్నా

డైలీ భారత్, కామారెడ్డి: తెలంగాణ స్టేట్ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ కామారెడ్డి సర్కిల్ కమిటీ ఆధ్వర్యంలో  వర్కర్ల ను సంస్థలో విలీనం చేసుకోవాలని  సోమవారం లంచ్ అవర్ లో ధర్నా చేయడం జరిగింది. ఈ ధర్నాకు  ముఖ్య అతిథులుగా  హాజరైన రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రెటరీ  సింగిరెడ్డి చంద్రారెడ్డి  మాట్లాడుతూ

మన కంపెనీ పరిధిలో పని చేస్తున్నటువంటి కార్మికులు 1607 మంది ఉండేది ఇప్పుడు కొందరు చనిపోగా కొందరు అంగవైకల్యం చెందాగా మిగిలిన వారు దాదాపు 1500 మంది ఉన్నారు వీరిని మన కంపెనీ పరిధిలో విలీనం చేసుకోవాలని కోరుతున్నాము. గతంలో కట్టర్ గా పనిచేస్తున్న వాళ్లను 2017లో TGSPDCL లో ఆర్టిజన్లుగా గుర్తించారు. కానీ TG NPDCL లో పని చేస్తున్న కార్మికులను ఆర్టిజన్లుగా గుర్తించలేదు. కావున TGNPDCL లో పని చేస్తున్నటువంటి కార్మికులను సంస్థలో  విలీనం చేసుకొవాలని కోరుచున్నాము.

ఈ కార్మికులు అందరూ మన ప్రభుత్వంపై మరియు మన కంపెనీ పై కొండంత ఆశ పెట్టుకున్నారు. ఎందుకంటె గతంలో ఈ విద్యుత్ సంస్థలో 1998 సంవత్సరంలో ఉన్న (VEW) విలేజ్ ఎలక్ట్రిసిటీ వర్కర్స్ ని కాంట్రాక్టు కార్మికులుగా 2002   సంవత్సరంలో బి.పి.ఎం.ఎస్. నెం. 36-37  ప్రకారము కాంట్రాక్ట్ జూనియర్ లైన్మెన్ గా విలీనం చేసుకున్నారు. ఆ తర్వాత  2006  సంవత్సరంలో 7114 జె.ఎల్.ఎం. పోస్టులు నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ పోస్టులన్ని సంస్థలో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికులతోనే భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశాము. ఈ మేరకు ఇచ్చిన నోటిఫికేషన్ కూడా రద్దు చేయాలని సంస్థలు పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికులతో నింపాలని, 7114 జె.ఎల్.ఎం. పోస్టులు భర్తీ చేయాలని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం దివంగత నేత డాక్టర్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి ఆదేశించినారు. అట్టి ఆదేశాల మేరకు అప్పటి ట్రాన్స్కో సి.యం.డి. రేచల్ చటర్జీ, ఐ. ఎ. ఎస్. 7114 జె.ఎల్.యం. పోస్టులు కాంట్రాక్టు కార్మికులతో భర్తీ చేశారు. కావున విద్యుత్ సంస్థలో ప్రాణాలకు తెగించి పని చేస్తున్నటువంటి   కార్మికులను మన ప్రజా ప్రభుత్వం  ఈ సంస్థలో విలీనం చేసుకొనే విధంగా చేయాలని తెలంగాణ స్టేట్ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ TGNPDCL కంపెనీ కమిటీగా మనవి చేయుచున్నాము.

 ఈ ధర్నాలో  రవి  కామారెడ్డి జిల్లా అధ్యక్షులు రవి మోహన్ జిల్లా సెక్రెటరీ  జిల్లా కమిటీ సభ్యులు గంగాధర్ సునీల్ గౌడ్ రాఘవ చారి దావీద్ రాజు డివిజన్ కమిటీ సభ్యులు, కార్మికులు అశోకు తదితరులు ఈ ధర్నాలో పాల్గొన్నారు.

Previous వందేళ్ల తర్వాత హోలీ రోజున చంద్రగ్రహణం.. విశిష్టత ఇదే
Next ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య
ADVERTISEMENT