బి టాపర్ సైనిక్ విద్యార్థులకు ఘనసన్మానం
డైలీ భారత్, కామారెడ్డి: జాతీయ సైనిక్ పాఠశాలల ప్రవేశ పరీక్ష ఫలితాలలో స్థానిక కామారెడ్డి లోని వివేకానంద పాఠశాల విద్యార్థులు 26 మంది అర్హత సాధించారు. ఈ సందర్భంగా పాఠశాల బృందం విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులతో విజయోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాడెంట్ కేసిరెడ్డి గురువేందర్ రెడ్డి మాట్లాడుతూ అద్భుతమైన ఫలితాలు సాధించుటకు సహకరించిన తల్లితండ్రులకు ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇంకా పాఠశాల ప్రిన్సిపాల్ వస్త్రాల వీర భద్రప్ప మాట్లాడుతూ భవిష్యత్ లో కూడా బి టాపర్స్ పాఠశాల ఇలాంటి విజయాలు ఎన్నో సాధిస్తుందని తెలియచేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఆల్ఫా క్యాంపస్ రెక్టర్ శ్రీ చందుపట్ల శ్రీకాంత్ , కో ఆర్టినేటర్ బిందు , సైనిక్ శిక్షణ ఇంచార్జి సంజీవ్ ,ఉపాధ్యాయులు , విద్యార్థులు మరియు తల్లితండ్రులు పాల్గొన్నారు.