సిల్వర్ జూబ్లీ వేడుకలు
డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని లక్ష్మీదేవి గార్డెన్స్ లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 2000 -2002 లో ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థుల సిల్వర్ జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ మాట్లాడుతూ అన్ని బంధాల కంటే స్నేహబంధం ఉన్నతమైనదని,స్నేహితులు ఒకరికొకరు సహకరించుకొని ముందుకు వెళ్లడం ఎంతో అభినందనీయమని అన్నారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న స్నేహితులకు సహకరించడానికి ముందుకు వచ్చిన వసీం, నాగరాజు లను ప్రత్యేకంగా అభినందించడం జరిగింది.ఇన్ని రోజుల తర్వాత స్నేహితులు అందరూ ఒకే దగ్గర కలవడం మర్చిపోని అనుభూతులను కలిగించమని జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి సహకరించిన ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో బండి ప్రభాకర్,డాక్టర్ బాలు,రేవేల్లి శ్రీనివాస్,మాడూరి శ్రీనివాస్,ఆనంద్,నవీన్,శ్రీకాంత్ సాయిలు,పులి సుధాకర్,జానకి రామ్,సుధ,భవాని, సుమలత లతో పాటు మిత్ర బృందం పాల్గొనడం జరిగింది.