| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

నకిలీ సిగరేట్ల అమ్మకాలపై వేములవాడలో ఆకస్మిక దాడులు : టాస్క్‌ఫోర్స్ సి.ఐ నటేష్.

నకిలీ సిగరేట్ల అమ్మకాలపై వేములవాడలో ఆకస్మిక దాడులు : టాస్క్‌ఫోర్స్ సి.ఐ నటేష్.

డైలీ భారత్, వేములవాడ: ఈరోజు నకిలీ సిగరేట్ల విక్రయాలపై జిల్లా గారి ఆదేశాల మేరకు వేములవాడ పట్టణంలో పలు కిరాణా,సూపర్ మార్కెట్,పాన్ షాప్ లలో ఆకస్మిక దాడులు నిర్వహించినట్లు టాస్క్‌ఫోర్స్ సి.ఐ నటేష్ తెలిపారు.

ఈసందర్భంగా సి.ఐ మాట్లాడుతూ...

జిల్లాలో నకిలీ సిగరేట్ల విక్రయాలు జరుగుతున్నాయన్న సమాచారం మేరకు వేములవాడ పట్టణంలో పలు కిరాణా షాప్స్,సూపర్ మార్కెట్లు, పాన్ షాప్ లలో ఆకస్మిక దాడులు నిర్వహించడం జరిగిందని, ప్రముఖ బ్రాండ్ల పేర్లతో నకిలీ సిగరేట్లు విక్రయించడం చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు.ఇలాంటి అక్రమ విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ప్రజలు, వ్యాపారులు చట్టాలను పాటించాలని సూచిస్తూ, నకిలీ సిగరేట్ల తయారీ లేదా విక్రయాలపై ఏవైనా సమాచారం ఉంటే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు తెలియజేయాలని కోరారు.అక్రమ కార్యకలాపాల నిర్మూలనకు పోలీసులకు ప్రజల సహకారం అవసరమని ఇన్స్పెక్టర్ పేర్కొన్నారు.

ఈ టాస్క్ లో టాస్క్ఫోర్స్ సిబ్బంది తిరుపతి, రాజేష్, శ్రీనివాస్, శివ పాల్గొన్నారు.

Previous "విద్యార్థులు పరీక్షల భయం వీడాలి" : సైకాలజిస్ట్ కె. పున్నంచందర్
Next రోడ్డు ప్రమాదాల కారణంగా దేశ భవిష్యతైన యువతను కోల్పోతున్నాం : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్, IPS
ADVERTISEMENT