| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

"విద్యార్థులు పరీక్షల భయం వీడాలి" : సైకాలజిస్ట్ కె. పున్నంచందర్

"విద్యార్థులు పరీక్షల భయం వీడాలి" :  సైకాలజిస్ట్ కె. పున్నంచందర్

డైలీ భారత్, సిరిసిల్ల: ఈరోజు  హెల్పింగ్ హార్ట్స్ వెల్ఫేర్ సొసైటీ స్వచ్ఛంద సంస్థ  మరియు తెలంగాణ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బద్దెనపల్లి లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పరీక్షల ఒత్తిడి (Examination Stress) పై అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ సైకాలజిస్ట్ కె. పున్నంచందర్ విద్యార్థులకు కౌన్సిలింగ్ అందించారు.

ఈ సందర్భంగా పున్నంచందర్ మాట్లాడుతూ, “విద్యార్థులు పరీక్షలను భయంగా కాకుండా ఒక అవకాశంగా చూడాలి. సరైన ప్రణాళిక, సమయపాలన మరియు సానుకూల దృక్పథం ఉంటే పరీక్షలలో విజయం సాధించవచ్చు” అని తెలిపారు. పరీక్షల ముందు కలిగే ఆందోళన, భయం, నిద్రలేమి వంటి లక్షణాలను ఎలా నియంత్రించుకోవాలో ఆయన వివరించారు.

విద్యార్థులకు మైండ్ మ్యాపింగ్ పద్ధతి గురించి సమగ్రంగా వివరిస్తూ, ఒక అంశాన్ని చిత్ర రూపంలో విభజించి చదివితే సులభంగా గుర్తుంచుకోవచ్చని తెలిపారు. ముఖ్యాంశాలను శాఖల రూపంలో రాసుకుంటే మెమొరీ శక్తి పెరుగుతుందని అన్నారు

అదేవిధంగా మెమొరీ టెక్నిక్స్ గురించి వివరించి,

అసోసియేషన్ పద్ధతి

విజువలైజేషన్ టెక్నిక్,

రిపిటిషన్ పద్ధతి,

కీవర్డ్ టెక్నిక్స్ 

వంటి విధానాలను ఉపయోగించడం ద్వారా చదివిన విషయాలను ఎక్కువకాలం గుర్తుంచుకోవచ్చని చెప్పారు.

ఈ కార్యక్రమంలో  హెల్పింగ్ హార్ట్స్ వెల్ఫేర్ సొసైటీ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు అలువల ఈశ్వర్, మండల విద్యాధికారి భూక్యా రాజు నాయక్, ఉపాధ్యాయులు శంకర్, తిరుపతిరెడ్డి, రంజీ నాయక్, విక్రమ్, రమణ విద్యార్థులు పాల్గొని ఆసక్తిగా సందేహాలు అడిగి నివృత్తి చేసుకున్నారు. ఈ అవగాహన కార్యక్రమం విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా నిలిచిందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు తెలిపారు.


Previous శీర్షిక : జాగ్రత్త మహిళా..!
Next నకిలీ సిగరేట్ల అమ్మకాలపై వేములవాడలో ఆకస్మిక దాడులు : టాస్క్‌ఫోర్స్ సి.ఐ నటేష్.
ADVERTISEMENT