| Daily భారత్
Logo




రాష్ట్ర బార్ కౌన్సిల్‌ ఎన్నికల బరిలో సాముల రాంరెడ్డి

News

Posted on 2025-12-30 16:46:54

Share: Share


రాష్ట్ర బార్ కౌన్సిల్‌ ఎన్నికల బరిలో  సాముల రాంరెడ్డి

న్యాయవాదుల హక్కులు,గౌరవం కోసం సాముల రాంరెడ్డి ముందడుగు

డైలీ భారత్, హుజూర్ నగర్:తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత  జరగనున్న మొదటి బార్ కౌన్సిల్ ఎన్నికల్లో సభ్యుడిగా ప్రముఖ న్యాయవాది, హుజూర్ నగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సాముల రామిరెడ్డి బరిలో నిలిచారు. 2026 జనవరి 30న జరగబోయే రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికలకు 2025 డిసెంబర్ 29న (సోమవారం) రాష్ట్ర హైకోర్టు లోని బార్ కౌన్సిల్ కార్యాలయంలో సాముల రాంరెడ్డి తన మద్దతుదారులతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు.

ఈ సందర్బంగా రాంరెడ్డి మాట్లాడుతూ... రాష్ట్ర బార్ కౌన్సిల్ అనేది న్యాయవాదుల హక్కుల రక్షణకు కవచం అన్నారు. రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికలు అనేవి సాధారణ ఎన్నికలు కాదని ఇవి న్యాయవృత్తి గౌరవాన్ని, న్యాయవాదుల భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలని అన్నారు. సీనియర్ న్యాయవాదుల అనుభవాన్ని గౌరవిస్తూ జూనియర్‌లకు మార్గనిర్దేశం చేసే బలమైన వ్యవస్థను రాష్ట్ర బార్ కౌన్సిల్‌లో నిర్మించాలని ఉద్ఘాటించారు. ఈ ఎన్నికల్లో ఐక్యతతో బలమైన రాష్ట్ర బార్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేసుకుంటే  న్యాయవాదుల భవిష్యత్తుకు భరోసా ఉంటుందన్నారు. న్యాయవాదుల హక్కుల కోసం, గౌరవం కోసం, ఐక్యతతో ముందుకు సాగుదామన్నారు. మనమంతా ఐక్యంగా నిలబడితే న్యాయవాదుల సమస్యలకు పరిష్కారం తప్పకుండా వస్తుందని ఈ ప్రయాణంలో  మీ మద్దతు నాకు అవసరమని మీతో పాటు నడిచే వ్యక్తిగా మీ ఓటుతో న్యాయవాదుల కోసం నిజాయితీగా పనిచేసే అవకాశం ఇవ్వాలని తన సీనియర్, సహచర, జూనియర్ న్యాయవాదులందరినీ అభ్యర్థించారు

బార్ కౌన్సిల్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో న్యాయవాద వర్గాల్లో రాజకీయ ఉత్కంఠ పెరిగింది. ఈ ఎన్నికల్లో  సాముల రాంరెడ్డి బరిలోకి దిగడం ఆసక్తికరంగా మారింది. న్యాయవాదుల హక్కులు, సంక్షేమం, వృత్తి పరిరక్షణ, న్యాయవాదుల భద్రత, సీనియర్ న్యాయవాదుల గౌరవం,ఆరోగ్య బీమా, కోర్టుల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి అంశాలను తన ప్రధాన అజెండాగా రాంరెడ్డి ప్రకటించారు. న్యాయవాదుల సమస్యలను నేరుగా వినిపించి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇస్తున్నారు. అనుభవం,సేవా దృక్పథంతో ముందుకు వెళ్తున్న ఆయనకు మద్దతు పెరుగుతున్నట్లు సమాచారం. ఇప్పటికే పలువురు సీనియర్ మరియు జూనియర్ న్యాయవాదులు రాంరెడ్డి అభ్యర్థిత్వానికి మద్దతు ప్రకటించగా వివిధ బార్ అసోసియేషన్ల నుంచి సానుకూల స్పందన వస్తుంది. మొత్తానికి బార్ కౌన్సిల్ ఎన్నికలు న్యాయవాదుల భవిష్యత్తును నిర్దేశించే కీలక ఎన్నికలుగా భావిస్తుండటంతో సాముల రాంరెడ్డి పోటీ రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది

అంచలంచలుగా ఎదుగుతూ

న్యాయ వాద వృత్తిని ప్రారంభించి  గత రెండు దశాబ్దాలుగా హుజూర్ నగర్ నియోజకవర్గంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా కొనసాగుతూ ఎంతో చరిత్ర కలిగిన హుజూర్ నగర్ పాత కోర్టు ప్రాంగణాన్ని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సుమారు 3 కోట్ల నిధులతో కోర్టు సముదాయాన్ని నిర్మింపజేసి కేవలం మున్సిబ్ (జూనియర్ సివిల్ జడ్జి) కోర్టు మాత్రమే ఉన్న హుజూర్ నగర్ కోర్టు సముదాయంలో అదనపు మున్సిబ్ కోర్టు, సీనియర్ సివిల్ జడ్జి కోర్టు, జిల్లా అదనపు కోర్టుతోపాటు మరో రెండు అదనపు జూనియర్ సివిల్ కోర్టులను ఏర్పాటు చేసేందుకు సాముల రాంరెడ్డి అవిశ్రాంత కృషి చేశారు. జూనియర్ సీనియర్ న్యాయవాదులకు వ్యక్తిగత మరియు వృత్తిపరమైన సమస్యలలో నేనున్నానంటూ సహాయ సహకారాలు అందిస్తూ అందరి మన్ననలు పొందుతూ న్యాయవాదుల సమస్యలతో పాటు సామాజిక బాధ్యతగా నేనున్నానంటూ  సహకారాలు అందిస్తూ కలియుగ దైవం తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యుడిగా ఎంతోమంది భక్తులకు సేవలందించి మన్ననలు పొందారు. తన స్వగ్రామమైన హుజూర్ నగర్ నియోజకవర్గంలోని అమరవరంలో తన కుటుంబ సభ్యులు ప్రజా ప్రతినిధులుగా సేవలు అందించే క్రమంలో నేను సహితం అంటూ  గ్రామ ప్రజల అవసరాలను తీరుస్తూ గల్లి నుంచి ఢిల్లీ దాకా ఉన్నత పదవులలో ఉంటూ అందరి ప్రశంసలు పొందుతూ ముందుకు సాగుతున్న తరుణంలో తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికలు రావడంతో రాష్ట్రస్థాయిలో ఉన్న న్యాయవాదుల సమస్యల పరిష్కారం కోసం తన వంతు భూమిక పోషించేందుకు బార్ కౌన్సిల్ ఎన్నికల్లో సభ్యునిగా నామినేషన్ వేసారు. సాముల రామిరెడ్డి ఎన్నికల్లో పోటీ చేస్తున్నందుకు హుజూర్ నగర్ బార్ అసోసియేషన్ సభ్యులతో పాటు తెలంగాణ లోని వివిధ బార్ అసోసియేషన్ల నుంచి మంచి స్పందన లభిస్తోంది. హుజూర్ నగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడుగా ఎన్నో అభివృద్ధి పనులు చేసిన రామిరెడ్డి రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడైతే న్యాయవాదుల సమస్యల పరిష్కారం కోసం తన వంతు పాత్ర పోషిస్తాడని తన విజయానికి అందరూ మద్దతు ప్రకటించాలని కోరుకుందాం


Image 1

రోడ్డు ప్రమాదాల నియంత్రణపై ప్రజల్లో మరింత చైతన్యం రావాలి : ఖమ్మం త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ మోహన్ బాబు

Posted On 2026-04-13 11:03:05

Readmore >
Image 1

యాక్సిస్ బ్యాంక్‌లో భారీ మోసం

Posted On 2026-04-13 08:36:04

Readmore >
Image 1

మేము కొన్ని తప్పులు చేశాము

Posted On 2026-04-12 22:37:33

Readmore >
Image 1

జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-04-12 18:47:01

Readmore >
Image 1

కామారెడ్డి పట్టణంలోని వీఆర్కే ఇంటర్ విద్యార్థులు తమ ప్రతిభతో ఉత్తమ ఫలితాలు సాధించారు

Posted On 2026-04-12 18:45:08

Readmore >
Image 1

సింగర్ ఆశా భోంస్లే కన్నుమూత

Posted On 2026-04-12 16:53:08

Readmore >
Image 1

భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు

Posted On 2026-04-12 13:50:08

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు

Posted On 2026-04-12 12:39:23

Readmore >
Image 1

భారీ అగ్నిప్రమాదం

Posted On 2026-04-12 12:10:38

Readmore >
Image 1

పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

Posted On 2026-04-12 11:41:31

Readmore >