| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

పార్కింగ్ చేసిన కారులో నుండి ఐదు లక్షలు కొట్టేసిన దొంగలు

పార్కింగ్ చేసిన కారులో నుండి ఐదు లక్షలు కొట్టేసిన దొంగలు

డైలీ భారత్, నల్గొండ: నల్గొండ జిల్లా దామరచర్ల మండల కేంద్రంలో పట్టు పగలే దొంగలు రెచ్చిపోయారు. దామరచర్లకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి అజ్మీర మాలు  ఓ ఇంటి స్థలం విక్రయానికి సంబంధించి మిర్యాలగూడ రిజిస్ట్రేషన్ ఆఫీసులో పని పూర్తి చేసుకొన్నాడు.

అక్కడి నుండి తన మిత్రులతో కలిసి  ఐదు లక్షల క్యాష్ కారులో పెట్టి భోజనం కోసం ఓ రెస్టారెంట్ ముందు కారు పార్కింగ్ చేశారు.

వారిని అనుసరిస్తూ బైక్ మీద వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు రెప్పపాటులో కారు అద్దాలు పగలగొట్టి ఐదు లక్షల క్యాష్ బ్యాగుతో పరారయ్యారు. బాధితుల ఫిర్యాదు మేరకు వాడపల్లి పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

Previous కొండగట్టు అంజన్న సేవలో :ఎమ్మెల్సీ కవిత
Next చందుర్తి మండలంలో యువకుడు దారుణ హత్య
ADVERTISEMENT