| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

అత్యాచారం కేసులో కామాంధునికి పదేళ్ల జైలుశిక్ష విధించిన జిల్లా మహిళా ప్రత్యేక కోర్టు

అత్యాచారం కేసులో కామాంధునికి పదేళ్ల జైలుశిక్ష విధించిన జిల్లా మహిళా ప్రత్యేక కోర్టు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:ఒక మహిళపై అత్యాచారం చేసిన కేసులో ముద్దాయి సాయినాథ్ కు పది సంవత్సరాల కఠిన జైలుశిక్ష విదిస్తూ నిజామాబాద్ ప్రత్యేక మహిళ కోర్టు స్పెషల్ సెషన్స్ జడ్జి డి. దుర్గా ప్రసాద్ శుక్రవారం తీర్పు చెప్పారు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ బంటు వసంత్ తెలిపిన వివరాలు. నిజామాబాద్ నగరంలోని భూమారెడ్డి కన్వేషన్ దగ్గర నివాసముండే సాయినాథ్ కు పెళ్లి చేసుకున్న భార్యతో కాపురం ఉండేవాడు.అతని మరదలుపై కన్నుపడింది. ఆమెను ఎలాగైనా శారీరకంగా  అనుభవించాలని మనసులో అనుకుని, ఆమె పని చేస్తున్న ప్రదేశంలోకి 29 నవంబర్, 2019 న  బైక్ పైన తీసుకెళ్లి   భూమారెడ్డి కన్వేషన్ దగ్గర ఉన్న తన ఇంటిలోకి తీసుకువెళ్లి బలవంతంగా అత్యాచారం చేశాడనే నేర అభియోగాలు రుజువు అయినట్లు నిర్దారణ కావడంతో సాయినాథ్ కు అత్యాచారం నేరంకుగాను పది సంవత్సరాల కఠిన జైలుశిక్ష విదిస్తూ న్యాయమూర్తి దుర్గా ప్రసాద్ తీర్పు వెలువరించారు. జైలిశిక్షతో పాటు పదివేల రూపాయల జరిమానా విధించారు. జరిమానా కట్టని యెడల అదనంగా ఆరు నెలల జైలుశిక్ష అనుభవించాలని తీర్పులో పేర్కొన్నారు.

Previous ఉపాధి హామీ పథకం పేరు మార్చిన కేంద్రం.. పనిదినాలు పెంచుతూ కేంద్రం నిర్ణయం
Next గుండాల అశోక్ ని భారీ మెజార్టీతో గెలిపించాలి : చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి భీమ్ భారత్
ADVERTISEMENT