| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

యజమాని ఇంట్లో దొంగతనం చేసిన మహిళ మరియు ఇతర ముద్దాయిల అరెస్ట్

యజమాని ఇంట్లో దొంగతనం చేసిన మహిళ మరియు ఇతర ముద్దాయిల అరెస్ట్

డైలీ భారత్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం వేపలగడ్డ గ్రామంలోని లింగం మాలకొండ రెడ్డి  ఇంటి పనిమనిషి సుజాతనగర్ గ్రామానికి చెందిన కావేటి కృష్ణవేణి అను మహిళ గత మూడు సంవత్సరాల నుండి ఆ ఇంట్లో పనిచేస్తూనమ్మకంగా ఉంటూ ఇంటి యజమానికి తెలియకుండా ఆ ఇంట్లో కబోర్డ్ లోదాచిన సుమారు 7139  గ్రాముల వెండి వస్తువులను మరియు 11.9 గ్రాములు గల బంగారపు వస్తువులను దొంగలించి అట్టి వస్తువులను కృష్ణవేణి మరియు ఆమె భర్త అయిన కావేటి రాంబాబు కలిసి కొత్తగూడెం చిన్న బజారులో  అమ్మినారు. ఫిర్యాది లింగమాల కొండారెడ్డి ఇచ్చిన దరఖాస్తు మేరకు కేసు నమోదు చేసి దొంగతనం చేసిన కృష్ణవేణిను, అందుకు సహకరించిన ఆమె భర్త రాంబాబును, అదే విధంగా అట్టి దొంగ వస్తువులను అమ్మిన మాధవాచారి మరియు శోభన్ చారీను, గోల్డ్ షాప్ యజమానులను ఈరోజు చుంచుపల్లి సిఐ  అరెస్టు చేసి వారి వద్ద నుండి కేసు యొక్క బంగారం మరియు వెండి సామాన్లను స్వాధీనపరచుకోవడంజరిగింది 

గోల్డ్ మరియు వెండి రికవరీ చేసి కేసును చేదించి నిందితుల వద్ద నుండి బంగారం మరియు వెండి సొమ్మును రికవరీ చేసిన చుంచుపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ రాయల వెంకటేశ్వర్లు , సుజాతనగర్ ఎస్సై రమాదేవి  సుజాతనగర్ సిబ్బందినీ, క్లూస్ టీం సిబ్బంది అయిన శోభన్ ను, కొత్తగూడెం సబ్ డివిజన్ డీఎస్పీ అబ్దుల్ రహమాన్   ప్రత్యేకంగా అభినందించడం జరిగింది.

Previous సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్యపై, ఎన్కౌంటర్లో మృతిచెందిన రియాజ్ ఘటనపై సిట్టింగ్ హైకోర్టు జడ్జిచే న్యాయ విచారణ చేయాలి
Next రాజన్న సిరిసిల్ల : వేములవాడ పట్టణం అగ్రహారంలో జరిగిన హత్య కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్,రిమాండ్
ADVERTISEMENT