| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మారేడుమిల్లి టైగర్ జోన్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ఆరుగురు మావోయిస్టులు హతం

మారేడుమిల్లి టైగర్ జోన్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ఆరుగురు మావోయిస్టులు హతం

డైలీ భారత్, ఆంధ్రప్రదేశ్:అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి టైగర్ జోన్ లో మంగళవారం ఉదయం భారీ ఎన్ కౌంటర్ జరిగింది. కాల్పుల మోతతో మారేడుమిల్లి అటవీప్రాంతం దద్దరిల్లింది. లోతట్టు అటవీప్రాంతంలో మావోయిస్ట్ అగ్రనేతలు ఆశ్రయం పొందుతున్నారని సమాచారం అందడంతో పోలీసులు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ క్రమంలో పోలీసులు - మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు హతమైనట్లు తెలుస్తోంది. మృతుల్లో మావోయిస్టు అగ్రనేత ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలంలో తుపాకులు, పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం టైగర్ జోన్ లో కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ ఎన్ కౌంటర్ పై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది..

Previous హైదరాబాద్‌లో ఐటీ దాడులు.. ప్రముఖ హోటల్‌ చైన్‌లపై సోదాలు
Next గ్యాస్ సిలిండర్ పేలి ఆరుగురికి తీవ్ర గాయాలు
ADVERTISEMENT