| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఘనంగా "బాలల దినోత్సవం"

ఘనంగా "బాలల దినోత్సవం"

 డైలీ భారత్, దమ్మపేట: జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దమ్మన్నపేట యందు నేడు బాలల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగిందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు చింతపల్లి వెంకటేశ్వరరావు తెలియజేశారు ఈరోజు ప్రధానోపాధ్యాయులుగా ఆరే మధు వ్యవహరించారు ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ నెహ్రూ గారికి బాలల అంటే చాలా ఇష్టం ఆ సందర్భంగా నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఘనంగా బాలల దినోత్సవం జరుపుకోవడం జరిగింది అని తెలిపారు నేటి బాలలే రేపటి పౌరులు కావున వారికి స్వయం పరిపాలన దినోత్సవం జరుపుకోవడం ద్వారా భవిష్యత్తులో ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా తెలిపారు నేడు ఉపాధ్యాయులుగా వారు ఎంచుకున్న విషయంలో పాఠ్యాంశాలు బోధించడం జరిగింది ఒక కొత్త అనుభూతిని పొందినట్లుగా నేటి ఉపాధ్యాయులు వారి అనుభవాలను తెలియజేశారు ఈరోజు ఉపాధ్యాయులుగా వ్యవహరించిన వారి నుండి ప్రతి సబ్జెక్టు నుండి ఒకరిని ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎన్నుకొని వారికి బహుమతులు అందించడం జరిగిందని తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో రెగ్యులర్ ఉపాధ్యాయులతో పాటుగా నేటి ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు  పాల్గొన్నారు

Previous స్నేహ సొసైటీ దివ్యంగపాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు
Next సిరిసిల్లలో పర్యటించిన వరంగల్ RJD సత్యనారాయణ రెడ్డి
ADVERTISEMENT