| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

టీఎన్జీవో ఉద్యోగుల సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం

టీఎన్జీవో ఉద్యోగుల సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం

డైలీ భారత్ న్యూస్ నిజామాబాద్: టీఎన్జీవో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా 2025-26 సంవత్సరానికి గాను బుధవారం బుధవారం ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్, టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు  నాశెట్టి సుమన్ కుమార్, టిఎన్జీవో జిల్లా కార్యదర్శి నేతి కుంట శేఖర్ ఆధ్వర్యంలో ఐ డి ఓ సి లో విద్యాశాఖ కార్యాలయం నందు టీఎన్జీవో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ముఖ్య అతిథులు టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు సుమన్ కుమార్ మాట్లాడుతూ టీఎన్జీవో సభ్యత్వ ప్రాముఖ్యతను తెలియజేస్తూ అన్ని శాఖల ఉద్యోగులు టీఎన్జీవో  సభ్యత్వాన్ని స్వీకరించాలని కోరారు. కార్యక్రమంలో టిఎన్జీవో ఉపాధ్యక్షులు శివకుమార్, సంయుక్త కార్యదర్శి జాఫర్ హుస్సేన్, టిఎన్జీవో అర్బన్ యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు జాకీర్ హుస్సేన్, మారుతి, విద్యాశాఖ ఫోరం అధ్యక్ష కార్యదర్శులు అన్వేష్ టీఎన్జీవో  సలహాదారులు వనమాల సుధాకర్  ఉద్యోగులు అధిక సంఖ్యలో  సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారన్నారు.

Previous జిల్లా కేంద్రంలో గురువారం జరిగే సుదర్శన్ రెడ్డి సన్మాన సభకు కాంగ్రెస్ కార్యకర్తలు తరలి రావాలి
Next మత్తు పదార్థాలు, గంజాయి, డ్రగ్స్ పదార్థాలకు తమ పిల్లలు బానిస కాకుండా తల్లిదండ్రులు ఓ కంట కనిపెట్టాలి
ADVERTISEMENT