| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఈ నెల 18న ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ 14వ వార్షికోత్సవ వేడుకలు

ఈ నెల 18న ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ 14వ వార్షికోత్సవ వేడుకలు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ 14వ వార్షికోత్సవ వేడుకలు ఈ నెల 18వ తేదిన స్థానిక రాజీవ్ గాంధీ ఆడిటోరియం లో నిర్వహించడం జరుగుతుందని, సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు మద్దుకూరి సాయిబాబు, కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను మంగళవారం ఇందూరు యువత కార్యలయంలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు మద్దుకూరి సాయిబాబు, ప్రధాన కార్యదర్శి వాలా బాలకిషన్ ఓ ప్రకటనలో తెలిపారు.

14 ఏండ్లుగా నిర్విరామైన సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఇందూరు యువత 15వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని మానవత్వపు గుండె నీడన-2025  పేరిట ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు సామాజిక సేవా కార్యక్రమాలవైపుగా ప్రతి ఒక్కరిని నడిపే దిశగా ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి వాలా బాలకిషన్, కార్యదర్శి రాచర్ల రాజేష్ శర్మ, డా‌.కాసర్ల నరేష్ రావ్, దర్శనం రాజు, చందా జగన్ మోహన్, సిర్పలింగం, రవి, తదితరులు పాల్గొన్నారు

Previous వైద్యం కోసం వెళ్లి మృతి చెందిన వృద్ధురాలి మెడలో నుంచి బంగారు గొలుసు అపహరించిన ఆస్పత్రి సిబ్బంది
Next ప్రభుత్వ నిషేదిత గంజాయి వంటి మత్తు పదార్ధాలను రవాణా చేసే వ్యక్తుల సమాచారం అందించండి : జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్
ADVERTISEMENT