Posted on 2024-01-02 12:12:43
కార్మికులకు రావలసిన బకాయి వేతనాలు వెంటనే అందించాలి
డైలీ భారత్, సిరిసిల్ల : ఈరోజు డివైడర్ పార్కులో పనిచేసే కార్మికులకు వెంటనే పని కల్పించాలని వారికి రావలసిన 5 నెలల బకాయి వేతనాలు ఇవ్వాలని మున్సిపల్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది
ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ముశం రమేష్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుండి సిరిసిల్ల పట్టణంలో గల పార్కులు డివైడర్లలో శానిటేషన్ పనిచేస్తున్న 50 మంది కార్మికులు పార్కులు డివైడర్లు పనిచేసే కాంట్రాక్టు తీసుకున్న వారి కాంట్రాక్టు గత నెల డిసెంబర్ 11 వరకు అయిపోవడం జరిగిందని తర్వాత మళ్లీ టెండర్ మున్సిపల్ అధికారులు వెయ్యకపోవడం వలన కాంట్రాక్టర్ కార్మికులను పనిచేయవద్దని చెప్పడం జరిగిందన్నారు దానితో 15 రోజుల నుండి కార్మికులు పని లేకుండా ఉంటున్నారని దానికి తోడు వారికి రావలసినటువంటి ఐదు నెలల వేతనాలు రాకపోవడం వలన ఒకపక్క పని లేక మరోపక్క చేసిన పనికి వేతనం రాకా కార్మికులు వారి కుటుంబాలు పస్తులు ఉండే పరిస్థితి నెలకొన్నదని ఇప్పటికే ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్ గారికి కలెక్టర్ గారికి వినతి పత్రాలు ఇచ్చిన కూడా సమస్య పరిష్కారం చేయడం లేదన్నారు వెంటనే కలెక్టర్ గారు జోక్యం చేసుకొని మళ్లీ డివైడర్లు పార్కులకు కొత్త టెండర్లు వేయించి కార్మికులకు ఉపాధి కల్పించాలని అదేవిధంగా బకాయి వేతనాలను ఇప్పించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నర్సయ్య , శారద , రమణమ్మ , గీత , వసంత , మణెమ్మ , లక్ష్మి , శ్రీకాంత్ , రాకేష్ , వంశీ , కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-08-01 18:43:13
Readmore >
జాతీయ జావలిన్ డేలో మరిమడ్ల విద్యార్థుల సత్తా... 1 గోల్డ్, 2 సిల్వర్, 1 బ్రాంజ్
Posted On 2026-08-01 16:47:06
Readmore >
సిరిసిల్ల కీర్తి పెంచిన బొల్లాజి సురక్ష... జావెలిన్ డే పోటీల్లో అద్భుత ప్రదర్శన
Posted On 2026-08-01 15:52:51
Readmore >
కామారెడ్డి ట్రాఫిక్ అవుట్‌పోస్ట్‌ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-08-01 15:46:07
Readmore >