| Daily భారత్
Logo




నేడు స్థానిక రిజర్వేషన్లు ఖరారు!

News

Posted on 2025-09-23 06:32:31

Share: Share


నేడు స్థానిక రిజర్వేషన్లు ఖరారు!

బీసీలకు 42%, ఎస్సీ, ఎస్టీలకు 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు!

జీవో విడుదల చేయనున్న ప్రభుత్వం

తర్వాత జిల్లాలవారీగా జాబితా ప్రకటన

డైలీ భారత్, హైదరాబాద్‌ : రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమైంది.

బీసీలకు 42% రిజర్వేషన్లను కేటాయిస్తూ జీవో జారీ చేయాలని నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీలకు 2011 జనాభా లెకల ప్రకారం రిజర్వేషన్లు కేటాయించాలని సూచించింది. ఈ మేరకు పంచాయతీరాజ్‌ శాఖ జిల్లాలకు మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మేరకు కలెక్టర్లు 31 జడ్పీ, 565 జడ్పీటీసీ, 5,763 ఎంపీటీసీ, 12,760 సర్పంచ్‌ స్థానాలకు రిజర్వేషన్లను ఖరారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. ప్రభుత్వం అధికారికంగా ఆదేశాలు జారీచేసిన వెంటనే కలెక్టర్లు జిల్లా స్థాయిలో రిజర్వేషన్లను వెల్లడించనున్నట్టు సమాచారం.

హైకోర్టు ఆదేశాల మేరకు సెప్టెంబర్‌ 30లోగా ఎన్నికల ప్రక్రియను ప్రారంభించి అక్టోబర్‌లో ఎన్నికలు ముగించే అవకాశం ఉన్నట్టు తెలిసింది. రాష్ట్రంలోని 12,760 పంచాయతీలు, 1,12,534 వార్డులు, 565 జడ్పీటీసీ స్థానాలు, 5,763 ఎంపీటీసీ స్థానాలకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత 565 మండల పరిషత్‌, 31 జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్ల ఎన్నికలు పరోక్ష పద్ధతిలో జరుగుతాయి. ఆదివారం కలెక్టర్లు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, జడ్పీ సీఈవోలు, జిల్లా పంచాయతీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకష్ణారావు మంగళవారం సాయంత్రంలోగా స్థానిక సంస్థల రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు.

Image 1

యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి

Posted On 2026-04-09 06:18:50

Readmore >
Image 1

సైబర్ మోసగాళ్ల చేతిలో మోసపోయిన ఎమ్మెల్యే

Posted On 2026-04-09 06:13:27

Readmore >
Image 1

తమిళనాడు ప్రధాన కార్యదర్శి గా తెలుగు వ్యక్తి ఎం.సాయికుమార్ బాధ్యతలు స్వీకారం

Posted On 2026-04-09 06:00:41

Readmore >
Image 1

“ప్రజాభద్రత–పోలీసు బాధ్యత”

Posted On 2026-04-09 05:56:24

Readmore >
Image 1

డేటా అవసరం లేని వారి కోసం "స్పెషల్" రీఛార్జ్ ప్లాన్లు!

Posted On 2026-04-08 19:12:36

Readmore >
Image 1

అర్థరాత్రి వేళ ఆపన్నహస్తం.. ""ఆపరేషన్ కవాచ్" తో సురక్షితంగా తల్లి ఒడికి బాలుడు!

Posted On 2026-04-08 17:33:40

Readmore >
Image 1

గర్భిణీ స్త్రీలు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సరైన వైద్య సేవలు పొందాలి : జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి.

Posted On 2026-04-08 17:28:46

Readmore >
Image 1

అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14 న మెగా రక్తదాన శిబిరం

Posted On 2026-04-08 13:16:01

Readmore >
Image 1

వరద ముంపునకు గురైన గిరిజన గురుకుల పాఠశాల నాగిరెడ్డిపేట్ కు గ్రీన్కో ఫౌండేషన్ ఆపన్నహస్తం

Posted On 2026-04-08 13:14:54

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా : ప్రేమ-పెళ్లి పేరుతో యువతిని వేధిస్తున్న యువకుడు అరెస్ట్,రిమాండ్‌కు తరలింపు

Posted On 2026-04-08 12:27:46

Readmore >