| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

వేములవాడ లో శరవేగంగా సాగుతున్న రాజన్న ఆలయ విస్తరణ పనులు

వేములవాడ లో శరవేగంగా సాగుతున్న రాజన్న ఆలయ విస్తరణ పనులు

ఆలయ ఈవో కార్యాలయం కూల్చివేత

డైలీ భారత్, వేములవాడ:దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడను టెంపుల్ సిటీగా అభివృద్ధి చేసే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. అభివృద్ధిలో భాగంగా రాజన్న ఆలయాన్ని విస్తరించే పనులు చేపట్టారు. ఇప్పటికే రోడ్డు వెడల్పు చేపట్టిన అధికారులు, ఆలయ సమీపంలోని నిర్మాణాలను తొలగిస్తున్నారు. ప్రధాన ఆలయం ముందు ఉన్న కళాభవన్ వారం రోజుల క్రితం కూల్చివేయగా తాజాగా ఆలయం వెనుక భాగంలోని ఆలయ ఈవో కార్యాలయాన్ని కూల్చివేస్తున్నారు. ఈవో కార్యాలయంతో పాటు, ప్రసాదాల తయారీ విభాగం, ఓపెన్ స్లాబ్, గోదాం, నివేదనశాలతో పాటు ప్రసాదాల విక్రయ కేంద్రాలను సైతం కూల్చివేస్తారు.

Previous నేడు స్థానిక రిజర్వేషన్లు ఖరారు!
Next మెడికల్ సూపరింటెండెంట్‌పై దాడీ కి నిరసనగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, మెడికో లు నల్ల బ్యాడ్జీలతో నిరసన
ADVERTISEMENT