| Daily భారత్
Logo




జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్

News

Posted on 2025-09-23 06:26:21

Share: Share


జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్

డైలీ భారత్, సూర్యాపేట:ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రజలకు, రోగులకు మరియు ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలందిస్తున్న వైద్యాధికారులకు రక్షణ కల్పిస్తున్నాము అని జిల్లా ఎస్పీ నర్సింహా ఐపీఎస్ తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల భద్రత తనిఖీల్లో భాగంగా ఈరోజు జిల్లా ఎస్పీ నర్సింహా ఐపీఎస్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి భద్రతను తనిఖీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారులు పోలీస్ శాఖతో సమన్వయంగా పనిచేయాలని ఎలాంటి మెడికో లీగల్ కేసులు నమోదు అయితే వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ ఆసుపత్రి నందు అన్ని రకాల సదుపాయాలతో ప్రజలకు ఉచితమైన మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారని ఇలాంటి సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఏదైనా సమస్య వస్తే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని కానీ వైద్యాధికారులపై ఆసుపత్రి నిర్మాణాలపై, వైద్య పరికరాలపై ఎలాంటి దాడులకు పూనుకోవద్దని పరికరాలను ద్వసం చేయవద్దు అని అన్నారు, ఇలాంటి చర్యలు చట్టపరంగా నేరం అని హెచ్చరించారు.  వైద్య సహాయం కోసం వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆసుపత్రి వైద్యాధికారులను ఎస్పీ ఆదేశించారు. ఆసుపత్రి నందు పనిచేసే ఉద్యోగులకు ఎలాంటి సమస్యలు వచ్చినా సంబంధిత అధికారుల వద్ద పరిష్కరించుకోవాలని ఇలాంటి విభేదాలకు, వివాదాలకు వెళ్ళవద్దని కోరారు.

అనంతరం ఆసుపత్రి ప్రాంగణంలో గల పోలీస్ అవుట్ పోస్టును పరిశీలించారు సిబ్బంది ఎల్లప్పుడు అందుబాటులో ఉండి ఎలాంటి కేసులు నమోదైన వెంటనే సంబంధిత పోలీస్ అధికారులకు తెలియపరచాలని రికార్డ్ నందు ప్రతి విషయాన్ని నమోదు చేయాలని సూచించారు, అంబులెన్స్ లకు, ప్రజల వాహనాలకు ఇబ్బంది కలగకుండా పార్కింగ్ చేయించాలని సూచించారు. మెడికో లీగల్ కేసు నమోదు అయితే వెంటనే పోలీసు వారికి సమాచారం వచ్చేలా వైద్యాధికారులతో సమన్వయంగా పనిచేయాలని దీనిని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రణాళిక తయారు చేయాలని సూర్యాపేట పట్టణ ఇన్స్పెక్టర్ కు సూచించారు.

కార్యక్రమం ముందు ఎస్పి వెంట స్థానిక డిఎస్పి ప్రసన్నకుమార్ సూర్యాపేట పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య స్పెషల్ బ్రాంచ్ వైద్యాధికారులు డాక్టర్ విజయ్ కుమార్, డా.వినయానంద్ డా.లక్ష్మణ్, డా.మనీషా మరియు పోలీస్ సిబ్బంది ఉన్నారు

Image 1

యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి

Posted On 2026-04-09 06:18:50

Readmore >
Image 1

సైబర్ మోసగాళ్ల చేతిలో మోసపోయిన ఎమ్మెల్యే

Posted On 2026-04-09 06:13:27

Readmore >
Image 1

తమిళనాడు ప్రధాన కార్యదర్శి గా తెలుగు వ్యక్తి ఎం.సాయికుమార్ బాధ్యతలు స్వీకారం

Posted On 2026-04-09 06:00:41

Readmore >
Image 1

“ప్రజాభద్రత–పోలీసు బాధ్యత”

Posted On 2026-04-09 05:56:24

Readmore >
Image 1

డేటా అవసరం లేని వారి కోసం "స్పెషల్" రీఛార్జ్ ప్లాన్లు!

Posted On 2026-04-08 19:12:36

Readmore >
Image 1

అర్థరాత్రి వేళ ఆపన్నహస్తం.. ""ఆపరేషన్ కవాచ్" తో సురక్షితంగా తల్లి ఒడికి బాలుడు!

Posted On 2026-04-08 17:33:40

Readmore >
Image 1

గర్భిణీ స్త్రీలు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సరైన వైద్య సేవలు పొందాలి : జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి.

Posted On 2026-04-08 17:28:46

Readmore >
Image 1

అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14 న మెగా రక్తదాన శిబిరం

Posted On 2026-04-08 13:16:01

Readmore >
Image 1

వరద ముంపునకు గురైన గిరిజన గురుకుల పాఠశాల నాగిరెడ్డిపేట్ కు గ్రీన్కో ఫౌండేషన్ ఆపన్నహస్తం

Posted On 2026-04-08 13:14:54

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా : ప్రేమ-పెళ్లి పేరుతో యువతిని వేధిస్తున్న యువకుడు అరెస్ట్,రిమాండ్‌కు తరలింపు

Posted On 2026-04-08 12:27:46

Readmore >