| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

బాలికపై హెడ్‌ కానిస్టేబుల్‌ లైంగిక దాడి

బాలికపై హెడ్‌ కానిస్టేబుల్‌ లైంగిక దాడి

డైలీ భారత్, చండీగఢ్‌: ఓ హెడ్‌ కానిస్టేబుల్‌ తన ఇంట్లో పని చేసే బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలు ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆ పోలీస్‌ అధికారిని అరెస్ట్‌ చేశారు. అలాగే ఆయనను సర్వీస్‌ నుంచి తొలగించారు. ఢిల్లీ శివారు ప్రాంతమైన హర్యానాలోని గురుగ్రామ్‌లో ఈ సంఘటన జరిగింది. హెడ్‌ కానిస్టేబుల్‌ అనూప్ సింగ్‌, పోలీస్‌ ఎస్కార్ట్ గార్డ్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. అతడి ఇంట్లో పనులు చేసే 14 ఏళ్ల బాలికపై గురువారం లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలు ఈ విషయాన్ని తన తల్లికి చెప్పింది. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కాగా.. ఈ సంఘటనపై పోలీసులు వెంటనే స్పందించారు. మేజిస్ట్రేట్‌ ఎదుట బాలిక స్టేట్‌మెంట్‌ను రికార్డ్‌ చేశారు. లైంగిక దాడికి పాల్పడిన హెడ్‌ కానిస్టేబుల్‌ అనూప్ సింగ్‌పై పోక్సో చట్టంతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆయనను అరెస్ట్‌ చేయడంతోపాటు సర్వీస్‌ నుంచి డిస్మిస్‌ చేసినట్లు డీసీపీ తెలిపారు. ఓ హెడ్‌ కానిస్టేబుల్‌ తన ఇంట్లో పని చేసే బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలు ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆ పోలీస్‌ అధికారిని అరెస్ట్‌ చేశారు. అలాగే ఆయనను సర్వీస్‌ నుంచి తొలగించారు. ఢిల్లీ శివారు ప్రాంతమైన హర్యానాలోని గురుగ్రామ్‌లో ఈ సంఘటన జరిగింది. హెడ్‌ కానిస్టేబుల్‌ అనూప్ సింగ్‌, పోలీస్‌ ఎస్కార్ట్ గార్డ్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. అతడి ఇంట్లో పనులు చేసే 14 ఏళ్ల బాలికపై గురువారం లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలు ఈ విషయాన్ని తన తల్లికి చెప్పింది. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కాగా.. ఈ సంఘటనపై పోలీసులు వెంటనే స్పందించారు. మేజిస్ట్రేట్‌ ఎదుట బాలిక స్టేట్‌మెంట్‌ను రికార్డ్‌ చేశారు. లైంగిక దాడికి పాల్పడిన హెడ్‌ కానిస్టేబుల్‌ అనూప్ సింగ్‌పై పోక్సో చట్టంతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆయనను అరెస్ట్‌ చేయడంతోపాటు సర్వీస్‌ నుంచి డిస్మిస్‌ చేసినట్లు డీసీపీ తెలిపారు.

Previous జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తాం : ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్
Next విద్యార్థినిపై లైంగిక దాడికి యత్నించిన కాలేజ్ ఛైర్మన్
ADVERTISEMENT