| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఇందూరు లో సందడి చేసిన సినీ నటి ఆశికా రంగనాథ్

ఇందూరు లో సందడి చేసిన సినీ నటి  ఆశికా రంగనాథ్

జువెలరీ షోరూం ప్రారంభించిన సినీ నటి

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:ఆదివారం నగరంలోని హైదరాబాద్​ రోడ్డులోని పద్మం సిల్వర్ జువెలరీ షోరూం ప్రారంభించారు. ఆమెను చూసేందుకు ఫ్యాన్స్​ తరలివచ్చారు.ఈ సందర్భంగా స్టెప్పులు వేసి ఫ్యాన్స్​ను అలరించింది. అనంతరం ఆమె మాట్లాడుతూ, నేటి యువత, మహిళల టేస్ట్​కు తగిన జ్యుయలరీ లు పద్మం సిల్వర్ జువెలరీస్ లో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.కన్నడ, తెలుగు, తమిళ సినిమాల్లో రాణిస్తున్న  సినీనటి ఆషికా రంగనాథ్ కన్నడ, తెలుగు, తమిళ సినిమాల్లో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఆషికా సినీ రంగంలోకి అడుగుపెట్టిన చిత్రం 2016లో విడుదలైన కన్నడ చిత్రం క్రేజీ బాయ్  ఈ చిత్రం ఆమెకు గుర్తింపును తెచ్చిపెట్టింది. ఆ తర్వాత రాంబో 2  రేమో ’మధగజ, వంటి చిత్రాలతో కన్నడ సినిమా పరిశ్రమ లో స్థిరపడింది. మధగజ చిత్రంలో ఆమె నటనకు SIIMA అవార్డు ఉత్తమ నటి (కన్నడ) విభాగంలో అవార్డు లభించింది. పద్మ సిల్వర్ జువెలరీస్ తన వ్యాపార సామ్రాజ్యాన్ని మరింతగా విస్తరించాలని, నాణ్యమైన సిల్వర్ జువెలరీస్ పద్మం జ్యువెలర్స్ లో ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయని, కావున నిజామాబాద్ జిల్లా ప్రజలు పద్మం సిల్వర్ జువెలరీస్ లో  మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండే ధరలు తోపాటు నాణ్యత తో కూడిన సిల్వర్ జువెలరీస్ పద్మం జువెలరీస్ లో లభిస్తాయని, ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా పదం జువెలరీస్ మేనేజ్మెంట్కు ఆమె అభినందించారు.


ఈ కార్యక్రమంలో పద్మజ మేనేజ్మెంట్ ప్రతినిధులు షోరూమ్ స్టాప్ తదితరులు పాల్గొన్నారు

Previous అక్క కళ్ళల్లో సంతోషం కోసం బావను హత్య చేసిన బామ్మర్ది
Next పార్టీ జెండా మొయ్యని వలస పార్టీ నేతలకు పలు ఆలయాల్లో అగ్ర తాంబూలం
ADVERTISEMENT